ఎస్బీఐ ఐపీఓకు ఇలా ఎగబడ్డారేంటీ? ఏకంగా రూ. 2.98 లక్షల కోట్లు- అలాట్‌మెంట్ ఎప్పుడు? జీఎంపీ ఎంత?

Wait 5 sec.

: దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ (AMC) ఎస్బీఐ- ఫ్రాన్స్‌కు చెందిన అముండీ సంయుక్త సంస్థ లభించింది. జులై 14న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాగా తొలి 2 రోజుల్లో అంటే జులై 14, 15 న నామమాత్రంగానే సబ్‌స్క్రిప్షన్ జరగ్గా.. ఆఖరి రోజు మాత్రం జులై 16న విపరీతమైన పోటీ నెలకొంది. ఓవరాల్‌గా 41.63 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించడం విశేషం. అంటే అందుబాటులో ఉంచిన షేర్ల కంటే ఇన్ని రెట్ల మేర బిడ్స్ నమోదయ్యాయి. దీనిని బట్టి ఏ స్థాయిలో ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్స్ (QIB) నుంచి 115.02 రెట్ల రెస్పాన్స్ రాగా, ఎన్ఐఐలు 22.41 రెట్ల మేర బిడ్స్ దాఖలు చేశారు. చిన్న మదుపరులుగా పరిగణించే రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 3.71 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఐపీఓకు ముందే సమీకరించగా ఐపీఓ పరిమాణం రూ. 11 వేల కోట్ల నుంచి చివరకు రూ. 9,813 కోట్లకు తగ్గింది. అయితే ఇక్కడ ఏకంగా రూ. 2.98 లక్షల కోట్ల విలువైన బిడ్స్ దాఖలు కావడం విశేషం. బిడ్ వాల్యూ పరంగా చూస్తే ఈ ఏడాదిలో ఇదే టాప్‌లో ఉంటుంది. ఇక ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇంకా 12.45 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో అందుబాటులో ఉంచగా 519 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఎస్బీఐ 6.3 శాతం, అముండీ 3.7 శాతం మొత్తంగా 10 శాతం వరకు వాటా విక్రయిస్తున్నాయి. ఇప్పటివరకు రిలయన్స్ పవర్- భారత ఐపీఓ చరిత్రలోనే బిడ్స్ విలువ పరంగా టాప్‌లో నిలిచింది. 2008లోనే వచ్చిన ఆ ఐపీఓకు ఏకంగా రూ. 7.12 లక్షల కోట్ల విలువైన బిడ్స్ దాఖలు కావడం విశేషం. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ. 4.42 లక్షల కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 3.26 లక్షల కోట్లు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ రూ. 2.99 లక్షల కోట్లు వరుసగా ఉన్నాయి.Read Also: ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 574 గా ఉండగా ఇక్కడ కనీస పెట్టుబడి రూ. 14924 గా ఉంది. ఒక్కో లాట్ కింద 26 షేర్లుగా నిర్ణయించారు. ఇక ప్రస్తుతం గ్రే మార్కెట్లో ప్రీమియం రూ. 92 చూయిస్తోంది. ఇది ఇష్యూ ధరతో చూస్తే దాదాపు 16 శాతం అధికం. అంటే దాదాపు రూ. 660- 670 మధ్య లిస్టింగ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఓకు అప్లై చేసిన వారికి షేర్ల అలాట్‌మెంట్ ఇవాళే (జులై 17) ఉండనుంది. షేర్లు వస్తే డీమ్యాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి. షేర్లు రాకుంటే రిఫండ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఫోన్‌కు మెసేజ్ ద్వారా సందేశం అందుకుంటారు. బ్రోకరేజీ యాప్‌ల్లోనూ చెక్ చేసుకోవచ్చు. జులై 21న స్టాక్ ఎక్స్చేంజీల్లోకి ఎంట్రీ ఇస్తుంది.