ఇలా అయిందేంటి? హెరిటేజ్ ఫుడ్స్‌కు భారీగా తగ్గిన లాభాలు- 3 నెలల్లో 1338 కోట్ల ఆదాయం

Wait 5 sec.

: భారతదేశంలోని ప్రముఖ డెయిరీ రంగ సంస్థల్లో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని గురువారం రోజు ప్రకటించింది. ఈ సమయంలో కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన సంస్థ ఆదాయం రూ. 1338.10 కోట్లుగా నమోదైంది. అంటే ఈ స్థాయిలో ఒక త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఆదాయం ఎప్పుడూ రాలేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆదాయం రూ. 1136.8 కోట్లుగా ఉంది. అక్కడితో చూస్తే ఆదాయం దాదాపు 18 శాతం వృద్ధి చెందింది. అయితే సమీక్షా త్రైమాసికంలో ఆదాయం భారీగా పెరిగినప్పటికీ, లాభం మాత్రం ఇదే సమయంలో భారీగా పడిపోవడం గమనార్హం. 3 నెలల కాలంలో సంస్థ నికర లాభం రూ. 25 కోట్లుగా వచ్చింది. ఏడాది కిందట ఇదే సమయంలో రూ. 40.5 కోట్ల లాభం ఉండగా ఇది ఏకంగా 38 శాతం పడిపోయింది. ఎబిటా (ఆపరేషనల్ ప్రాఫిట్) 29 శాతం తగ్గి రూ. 61.9 కోట్లుగా వచ్చింది. ఖర్చులు పెరగడంతోనే ఆపరేటింగ్ లాభాలు తగ్గాయని సంస్థ పేర్కొంది. ఎబిటా మార్జిన్ కూడా 188 బేసిస్ పాయింట్లు తగ్గి 4.6 శాతంగా నమోదైంది. కంపెనీ ఆదాయం భారీగా పెరిగినా లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో పాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, లీటరు పాల సేకరణ సగటు ధర ఏడాది కిందటితో పోలిస్తే పెరగడమేనని చెబుతోంది. ఇదే లాభాలపై గణనీయమైన ప్రభావం చూపినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. అయితే పాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, మార్కెట్లో వాటాను పెంచుకోవడం, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విభాగంలో వినూత్న ఆవిష్కరణలతో వృద్ధిని వేగవంతం చేయడంపై కంపెనీ దృష్టి సారించిందని చెప్పారు.Read Also: ఐస్‌క్రీమ్ బిజినెస్ జోరుగురువారం రోజు స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత కంపెనీ త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసి స్టాక్ ఎక్స్చేంజీలకు నివేదించింది. దీని ప్రకారం సమీక్షా త్రైమాసికంలో కంపెనీ పాల సేకరణ రోజుకు 2 శాతం మేర పెరిగి 18.10 లక్షల లీటర్లకు చేరింది. లీటరు పాలు సేకరించేందుకు కంపెనీకి అయిన సగటు ధర 7.2 శాతం పెరిగి రూ. 46.61 కి చేరింది. సేకరణ ధరలు విపరీతంగా పెరగడం వల్లే మార్జిన్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విభాగం ఆదాయం 39.7 శాతం పెరిగి రూ. 563.6 కోట్లకు చేరింది. పనీర్, పెరుగు, మజ్జిగ, లస్సీల అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా ఐస్‌క్రీమ్ బిజినెస్ ఏకంగా 65 శాతం వార్షిక వృద్ధితో రూ. 55 కోట్లకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. చంద్రబాబు స్థాపించినా షేర్లు లేవుఈ కంపెనీ విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 1992లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. అయితే చంద్రబాబుకు ప్రస్తుతం సంస్థలో ఎలాంటి వాటా లేదు. అంటే షేర్లు లేవు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైస్ ఛైర్‌పర్సన్, ఎండీగా ఉన్నారు. వీరి కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.పడుతున్న షేర్ ధర1994లోనే హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కాగా కొంత కాలంగా స్టాక్ నిరాశాజనక ప్రదర్శన చేస్తుంది. గత 6 నెలల్లో 23 శాతం తగ్గింది. గురువారం సెషన్‌ ముగిసేసరికి స్టాక్ ధర రూ. 338 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 3.14 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 540, కనిష్ఠ ధర రూ. 292.55 గా ఉంది.