: భారత దిగ్గజ ఐటీ సంస్థలు వరుసగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికం (Q1) ఫలితాల్ని ప్రకటిస్తూ వస్తున్నాయి. ముందుగా టీసీఎస్, తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఏప్రిల్- జూన్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించగా ఇప్పుడు గురువారం రోజు స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత మార్కెట్ వాల్యూ పరంగా నాలుగో, ఐదో చేశాయి. అయితే ఈసారి అన్ని కంపెనీలూ సానుకూల ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. ఇక్కడ టెక్ మహీంద్రా కూడా అదే బాటలో పయనించింది. సంస్థ నికర లాభం 3 నెలల కాలంలో ఏకీకృత ప్రాతిపదికన రూ. 1465 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 1141 కోట్లుగా ఉండగా అక్కడితో చూస్తే దాదాపు 28.4 శాతం పెరగడం విశేషం. ఇంకా టెక్ మహీంద్రా కార్యకలాపాల ఆదాయం ఇదే సమీక్షా త్రైమాసికంలో 17.7 శాతం పెరిగి రూ. 15,712 కోట్లుగా నమోదైంది. అట్రిషన్ రేటు 11.8 శాతంగా ఉండగా, ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా 863 తగ్గింది. డాలర్ల ప్రాతిపదికన చూసినా ఆదాయంలో వార్షికంగా 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 2.2 శాతం పెరిగి 1660 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అన్ని విభాగాల్లో వ్యాపార వృద్ధి నమోదు చేసినట్లు సంస్థ సీఈఓ, ఎండీ మోహిత్ జోషి వెల్లడించారు. వరుసగా 3 త్రైమాసికాల్లోనూ 100 కోట్ల డాలర్లకుపైగా విలువైన ఒప్పందాల్ని దక్కించుకోవడం తమ వ్యాపార దృఢత్వాన్ని, తమ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయని ఆయన చెప్పారు. Read Also: ఈ క్రమంలోనే మంచి లాభాలు, ఆదాయం సాధించిన నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు మోహిత్ జోషి గుడ్‌న్యూస్ చెప్పారు. మళ్లీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ (ప్రాంగణ నియామకాలు) ప్రారంభిస్తామన్నారు. ఆదాయాల గురించి ఇన్ని రోజులు స్పష్టత లేనందునే కొంత కాలంగా నియామకాలు చేపట్టలేకపోయామని, ఇప్పుడు ఆదాయాలపై స్పష్టత రావడంతో నియామకాల్ని తిరిగి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. చాలా కాలంగా ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తిరిగి నియామకాలు చేపడుతున్నాయి. ఇక క్యూ1 ఫలితాల అనంతరం శుక్రవారం సెషన్‌లో టెక్ మహీంద్రా షేరు పుంజుకుంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 10.30 గంటలకు 2.50 శాతానికిపైగా లాభంతో రూ. 1548 స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో 3 శాతానికిపైగా పెరిగింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 1.52 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1854 కాగా, కనిష్ఠ ధర రూ. 1304.10 గా ఉంది. 6 నెలల్లో దాదాపు 10 శాతం వరకు పతనమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితి, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర ఐటీ స్టాక్స్ అన్నీ భారీగా పడిపోయినా ఇది పెద్దగా ప్రభావితం కాలేదని చెప్పొచ్చు.