ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా వడ్డీ వస్తుంది.. కేంద్రం హామీ.. నెలకు రూ. 9250 రావాలంటే ఇలా!

Wait 5 sec.

: చాలా మంది స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రిస్క్ అని భావించి సంప్రదాయ, సురక్షిత పెట్టుబడి సాధనాలైన పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారని చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఇక్కడ నెలనెలా వడ్డీ అందించే బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. చాలా వరకు ఒకసారి జమ చేస్తే నిర్దిష్ట వ్యవధి తర్వాత చేతికొచ్చేవే ఉంటాయి. కానీ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో (POMIS) మీరు డబ్బులు జమ చేస్తే ప్రతి నెలా వడ్డీ అందుకోవచ్చు. ఒక్కసారి లంప్ సమ్ పెట్టుబడి పెడితే ప్రతి నెలా మీ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడతాయి. ప్రస్తుతం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు ఇక్కడ 7.40 శాతంగా ఉంది. పెట్టుబడి విషయానికి వస్తే కనీసం రూ. 1000 తో ఇందులో చేరొచ్చు. గరిష్ఠ పెట్టుబడి విషయానికి వస్తే ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్‌లో అయితే గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. జాయింట్ అకౌంట్ కింద గరిష్ఠంగా ముగ్గురు ఉండొచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు కూడా అకౌంట్ తెరవొచ్చు. ఇక్కడ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో ముందుగా తీసుకోవాలనుకుంటే కాస్త పెనాల్టీ పడుతుంది. 1-3 ఏళ్ల మధ్య పెట్టుబడి డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే మీ డిపాజిట్ అమౌంట్లో 2 శాతం వరకు కోత విధిస్తారు. అదే 3-5 ఏళ్ల మధ్య ఈ నిర్ణయం తీసుకుంటే ఒక శాతం కట్ అవుతుంది.Read Also: ఎంత జమ చేస్తే నెలకు వడ్డీ ఎంతొస్తుంది?ఇక్కడ ఉదాహణకు రూ. 5 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే 7.40 శాతం వడ్డీ రేటు చొప్పున ప్రతి నెలా రూ. 3083 చొప్పున వడ్డీ వస్తుంది. ఇక్కడ ఏడాదికి వడ్డీతోనే రూ. 36,996 వడ్డీ అందుతుందని చెప్పొచ్చు. ఇలా ఐదేళ్లపాటు వస్తాయి. మళ్లీ మెచ్యూరిటీకి మీ మొత్తం డబ్బులు తిరిగొస్తాయి. ఓవరాల్‌గా మీ రూ. 5 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో వడ్డీతో రూ. 1,84,980 వస్తుంది.సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠ పెట్టుబడి మొత్తం అయిన రూ. 9 లక్షలు జమ చేస్తే నెలనెలా వడ్డీ రూ. 5,550 వస్తుంది. ఇక్కడ ఏడాదికి రూ. 66,600 వస్తుంది. ఇలా ఐదేళ్లకు రూ. 3.33 లక్షలు వస్తాయి. ఇదే విధంగా జాయింట్ అకౌంట్ కింద రూ. 10 లక్షలు జమ చేస్తే గనుక ప్రతి నెలా వడ్డీతో రూ. 6,167 వస్తుంది. ఇక్కడ సంవత్సరానికి రూ. 74,004 అందుతుంది. మొత్తం ఐదేళ్ల కాలానికి వడ్డీ రూపంలో రూ. 3,70,020 వరకు వస్తుంది. జాయింట్ అకౌంట్ కింద గరిష్ఠ పెట్టుబడి మొత్తం అయిన రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా వడ్డీతోనే చేతికి రూ. 9250 అందుతుంది. ఇది సంవత్సరానికి చూస్తే రూ. 1.11 వేలు, ఐదేళ్లకు చూస్తే రూ. 5.55 లక్షల వరకు వడ్డీ రూపంలో అందుతుంది. అంటే రూ. 15 లక్షల డిపాజిట్‌పై రూ. 5.55 లక్షల లాభం వచ్చిందని చెప్పొచ్చు.Read Also: తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)పోస్టాఫీస్ వడ్డీ రేటు ఎంత?ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.40 శాతంగా వడ్డీ రేటు ఉంది.రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలనెలా వడ్డీ ఎంత అందుకోవచ్చు?A. ప్రతి నెలా రూ. 5550 వడ్డీ వస్తుంది.పీఓఎంఐఎస్‌లో పెట్టుబడి పరిమితులు ఎలా ఉన్నాయి?సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.POMIS కాల పరిమితి ఎంత?5 సంవత్సరాలుమంత్లీ ఇన్‌కం స్కీమ్ సురక్షిత పెట్టుబడి సాధనమేనా?అవును. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న స్కీమ్. కాబట్టి రిస్క్ ఉండదు. కచ్చితమైన రిటర్న్స్ వస్తాయి.