షాబాద్: రాజ్‌కుమార్‌ కంటే భార్య ఆరేళ్లు పెద్ద.. తనకు ట్యూషన్ చెప్పిన ఆమెను ప్రేమ పేరిట వేధించి పెళ్లాడి..

Wait 5 sec.

: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సామూహిక హత్యల కేసులో ఊహించని భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఉన్మాది రాజ్‌కుమార్ నేరాల వెనుక ఉన్న కారణాలు చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే షాక్‌కు గురవుతున్నారు. కట్టుకున్న భార్య సరిత, ఇద్దరు పసిపిల్లలను అతడు ఎందుకు అంత దారుణంగా అంత మొందించాడనే కోణంలో కుటుంబ సభ్యులు, నిందితుడి సోదరి వెల్లడించిన వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.ట్యూషన్ టీచర్‌తో ప్రేమ.. బలవంతపు పెళ్లి!బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాజ్‌కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అతనికి సరిత ట్యూషన్ చెప్పేది. వయసులో తనకంటే ఆరేళ్లు పెద్దది అయినప్పటికీ.. ప్రేమ పేరుతో తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. సరితకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో.. రాజ్‌కుమార్ ఆ సంబంధాలన్నింటినీ చెడగొట్టాడు. తీవ్రంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడి చివరకు 2018లో సరితను వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగున్నరేళ్ల పరీక్షిత్, రెండేళ్ల దైవీక్షిత్ అనే ఇద్దరు ఉన్నారు.జూదం, బెట్టింగ్‌ల మైకం.. రూ. 2 కోట్ల అప్పులు!మొదట్లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించిన రాజ్‌కుమార్.. ఆ తర్వాత ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే భారీగా అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఒకానొక దశలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ డ్రామాలు ఆడాడు. కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అతని తల్లిదండ్రులు తమకున్న కొంత వ్యవసాయ భూమిని అమ్మేసి అప్పులు తీర్చారు. అయినప్పటికీ రాజ్‌కుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా వారికున్న మొత్తం భూమినంతా అమ్మించేశాడు. వచ్చిన డబ్బుతో విలాసాలకు మరిగి, డ్రగ్స్, మద్యానికి పూర్తిగా బానిసగా మారాడు. రాజ్‌కుమార్ ఏకంగా రూ. 2 కోట్ల వరకు అప్పులు చేశాడని, ఆ అప్పుల డబ్బుతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య సరితను నరకయాతనకు గురి చేసేవాడని నిందితుడి సొంత సోదరి మీడియా ముందు కన్నీరు మున్నీరైంది.విడాకులు అడిగిందనే కక్షతోనే మారణహోమం!రూ. 2 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా రోజురోజుకూ పెరుగుతున్న శారీరక, మానసిక వేధింపులను భార్య సరిత భరించలేకపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో, విరక్తితో రాజ్‌కుమార్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. లీగల్‌గా విడాకులు ఇవ్వాలంటూ భర్తను గట్టిగా నిలదీసింది. తనే ప్రాణంలా భావించి, అందరినీ ఎదిరించి పెళ్లాడిన భార్యే తనను వదిలేసి వెళ్లాలని చూడటాన్ని రాజ్‌కుమార్ తట్టుకోలేకపోయాడు. ఎలాగూ పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చాననే కక్ష, దానికి తోడు భార్య విడాకులు అడుగుతోందనే క్రోధం కలగలిసి అతడిని రాక్షసుడిగా మార్చాయి. ఈ కోపంతోనే సరిత పీక కోసి హతమార్చాడు. తన తర్వాత పిల్లలు అనాథలు కాకూడదనే ఉన్మాదంతోనో, లేక సరితపై ఉన్న కక్షతోనో కానీ.. తన ఇద్దరు పసికొడుకులను కూడా నిద్రిస్తున్న బెడ్‌రూమ్‌లోనే నరికి చంపాడు.