పాఠశాలల్లో లైంగిక విద్యపై చరిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్రం

Wait 5 sec.

విద్యావిధానంలో యువత ఆరోగ్యం, భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ‘సమగ్ర ’ను పాఠ్యప్రణాళికలో ఒక అధికారికంగా ప్రవేశపెట్టేందుకు అంగీకరించినట్లు కూడిన ధర్మాసనం ముందు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ వివరాలను వెల్లడించారు. 26 మంది సభ్యుల జాతీయ నిపుణుల కమిటీ చేసిన విస్తృతమైన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించినట్లు ఆమె ఈ సందర్భంగా ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు తుది ఆమోదమే తరువాయి ఈ సరికొత్త పాఠ్యప్రణాళికను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.ఈ మార్పు ఇప్పుడే ఎందుకు?‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం’ కింద కౌమారదశలో ఉన్నవారి మధ్య పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలను నేరంగా పరిగణిస్తు తీరుపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఆందోళనకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణల సందర్భంగా.. ప్రస్తుతం చట్టపరంగా లైంగిక సంబంధానికి సమ్మతి వయసు 18 ఏళ్లుగా ఉంది. ఈ నిబంధన కారణంగా టీనేజర్ల పరస్పర అంగీకార సంబంధాలు కూడా క్రిమినల్ కేసులుగా మారుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ఆయుధంగా వాడుతూ అబ్బాయిలపై క్రిమినల్ కేసులు పెడుతున్నారని జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం గమనించింది. కౌమారదశ శారీరక, మానసిక మార్పులతో ప్రయోగాలకు గురయ్యే సున్నితమైన వయసుని, కేవలం క్రిమినల్ శిక్షల ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని కోర్టు నొక్కిచెప్పింది.టీనేజర్లను నేరస్థులుగా పరిగణించడానికి బదులు వారికి అవగాహన కల్పించే మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్రం 26 మంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) నిపుణులు, క్లినికల్ సైకాలజిస్టులు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా), జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్) ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ లైంగిక విద్యను ఒక పద్దతి ప్రకారణం ప్రామాణీకరించడమే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారమని సూచించింది.ప్రతిపాదిత పాఠ్యప్రణాళిక ఎలా ఉంటుంది?లైంగిక విద్య అనేది ఏదో ఒక రోజు జరిగే వర్క్‌షాపులా లేదా చిన్న సెమినార్‌లా ఉండకూడదని నివేదిక స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020కి అనుగుణంగా.. పాఠ్యప్రణాళికలో తప్పనిసరి చేయాలని సూచించింది.ప్రాథమిక పాఠశాల నుంచే ప్రత్యేక నిపుణులైన ఉపాధ్యాయులు ఈ అంశాలపై వారానికి రెండుసార్లు, 15 నుంచి 20 నిమిషాల పాటు తప్పనిసరి తరగతులు నిర్వహించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ దశలో వయసుకు తగిన అంశాలపై పరిశుభ్రత, శరీర భాగాలను గుర్తించడం, ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ను అర్థం చేసుకోవడం వంటి భావనలపై పూర్తిగా దృష్టి పెడతారు.విద్యార్థులు ఎదుగుతున్నకొద్దీ యవ్వనదశ, హార్మోన్ల మార్పులు, వ్యక్తిగత హద్దులు, అసురక్షిత పరిస్థితులను గుర్తించడం, అలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి వంటి కీలక అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చుతారు.లైంగిక విద్యపై అపోహదేశంలో లైంగిక అంశాలపై లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక భావనలు, అపోహలను దృష్టిలో ఉంచుకుని బాల్య వికాస దశలు, లైంగిక విద్య వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది.కాగా, భారత్‌లో లైంగిక విద్యను పాఠ్యాంశంగా తీసుకొచ్చేందుకు దశాబ్దాలుగా జరుగుతోన్న ప్రయత్నాలకు తీవ్ర రాజకీయ, సామాజిక ప్రతిఘటన ఎదురైంది. చాలామంది ఇది భారతీయ సంస్కృతికి సరిపడని పాశ్చాత్య భావజాలమని విమర్శిస్తున్నారు. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ వంటి ద్వారా తప్పుడు సమాచారాన్ని పొందుతున్నారని కమిటీ గుర్తుచేసింది. శాస్త్రీయ అవగాహన లేకపోవడం వల్లే తప్పుడు సమాచారం బారిన పడటంతో పాటు, లైంగిక దోపిడీ, దుర్వినియోగానికి గురవుతున్నారని నిపుణులు స్పష్టం చేశారు.