: స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు ఊహించని పరిణాలు జరిగి షేర్ల ధరల భారీగా పడిపోవడం లేదా పెరగడం జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం కంపెనీలు చేపట్టే కార్పొరేట్ చర్యల కారణంగా షేరు ధరల్లో భారీ మార్పులు కనిపిస్తాయి. ఈరోజు దేశీయ సూచీలు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. 800 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నా ఓ స్టాక్ మాత్రం ఆరంభంలోనే 80 శాతం మేర పడిపోయింది. ఈ విషయం చాలా మంది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. అదే ఇండియన్ టోనర్స్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ (Indian Toners And Developers Limited) స్టాక్. అయితే, ఈ స్టాక్ ఎందుకు భారీగా పడిపోయింది. రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలేంటి? అనేది తెలుసుకుందాం. చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రికార్డ్ తేదీని జులై 17, 2026గా నిర్ణయించారు. దీని ప్రకారం ఈరోజు జులై 17 శుక్రవారం రోజున ఈ స్టాక్ ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ చేపట్టింది. దీంతోనే ఈ స్టాక్ ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది. క్రితం రోజు రూ.277 స్థాయిలో ట్రేడయిన స్టాక్ ఇవాళ ఒక్కసారిగా 80 శాతం మేర పడిపోయి రూ.57 స్థాయికి పడిపోయి ట్రేడింగ్ మొదలు పెట్టింది. కంపెనీ చేపట్టిన స్టాక్ స్ప్లిట్ 5:1 రేషియో ప్రకారం రూ.10 ఫేల్ వాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరును రూ.2 ముఖ విలువ ఉండేలా 5 షేర్లుగా విభజన జరిగింది. దీంతో ఈ కంపెనీలో 1 షేరు కొన్నవారికి 5 షేర్లు లభిస్తాయి. ఇదే క్రమంలో 100 షేర్లు కొన్నవారికి 500 షేర్లు వస్తాయి. అయితే, షేరు ధర 80 శాతం పడిపోయింది కదా అందంతా నష్టమేనా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. అయితే, స్టాక్ ధర 80 శాతం పడిపోయినప్పటికీ ఇన్వెస్టర్ల పెట్టుబడిలో ఎలాంటి నష్టం ఉండదు. డీమ్యాట్ ఖాతాలో షేర్ల సంఖ్య 5 రెట్లు పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే షేరు ధరను తగ్గించారు. ఇది కేవలం సాంకేతికంగా చేపట్టిన సర్దుబాటు మాత్రమేనని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత షేరు ధర పడిపోతే అప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. పెరిగితే మాత్రం భారీగా లాభాలు వస్తాయి. క్రితం రోజు ముగింపు ధర రూ.277.65తో పోలిస్తే ఆరంభంలోనే 80 శాతం మేర నష్టపోయింది. ఒక దశలో కాస్త పెరిగి రూ.57.40 గరిష్ఠాన్ని తాకినా ఆ తర్వాత మళ్లీ తగ్గింది. ఈ వార్త రాసే సమయం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ షేరు 80.77 శాతం నష్టం రూ.53.40 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.60, కనిష్ఠ ధర రూ.43.08కి సర్దుబాటు చేశారు. అలాగే కంపెనీ మార్కెట్ విలువ రూ.300 కోట్ల నుంచి రూ.55.50 కోట్లకు సర్దుబాటు చేశారు.