త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ఉప ప్రధానిగా అమిత్ షా..! విజయసాయి రెడ్డి ఆసక్తికర పోస్టు..!!

Wait 5 sec.

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి గత కొంత కాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నుంచి కొందరు నేతలకు మంత్రి పదవులు లభిస్తాయని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. సీనియర్ల శాఖలను మారుస్తారని.. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో శాఖను అప్పగిస్తారని.. ఆర్బీఐ గవర్నర్‌గా పని చేసిన శక్తి కాంత దాస్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళన ఉండొచ్చని కూడా చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆసక్తికర పోస్టు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉప ప్రధానిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోందని విజయ సాయి రెడ్డి తెలిపారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించాల్సిన నిర్ణయం అన్నారు. పరిపాలన సామర్థ్యం, రాజకీయ చతురత ఉన్న ఆ బాధ్యతలు తీసుకోవడానికి సరైన వ్యక్తి అని విజయ సాయి అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఉప ప్రధాని పదవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విజయ సాయి.. గతంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అలంకరించిన ఈ పదవిని అమిత్ షా అధిష్టించడం సుముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.మోదీ-షా విడదీయలేని బంధం..కేంద్ర హోం మంత్రి, బీజేపీలో కీలక నేత అయిన అమిత్ షా ప్రధాని మోదీకి నమ్మిన బంటు అనే సంగతి తెలిసిందే. 1980ల చివరి దశ నుంచి వీరి మధ్య స్నేహం ఉంది. 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాక.. అమిత్ షాకు ఆ రాష్ట్ర హోం శాఖ పదవిని అప్పగించారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన తర్వాత.. కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అమిత్ షా తీసుకున్నారు. మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక.. అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడు అయ్యారు. 2019లో కీలకమైన హోం శాఖ బాధ్యతలను ఆయన చేపట్టారు.మోదీ భారత ప్రధాని పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ పరిస్థితుల్లో అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రమోట్ చేస్తే.. మోదీ తర్వాత ప్రధాని పగ్గాలు ఆయనకు ఇస్తారనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్డీయే తరఫున వాజయ్‌పేయి ప్రధానిగా పని చేసిన సమయంలో.. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఉప ప్రధానిగా పని చేసిన సంగతి తెలిసిందే.