Kadapa: ప్రియురాలిని బాధపెడుతున్న భర్త.. మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య

Wait 5 sec.

వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. వీరి బంధం బలపడుతున్న సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసిపోయింది. అబ్బాయిని పిలిచి మందలించారు, ఇంకోసారి అమ్మాయితో తిరగొద్దని చెప్పారు. ఈ విషయాన్ని అబ్బాయి తన ఇంట్లో చెప్పగా.. వాళ్లు కూడా అబ్బాయినే మందలించారు. కొద్ది రోజుల తర్వాత అమ్మాయికి పెళ్లయింది.. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి తన ప్రియురాలిని సరిగా చూసుకోవడం లేదని మస్తాపంతో చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలానికి చెందిన ఓ యువకుడు పట్టణంలోని బైక్ షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తాడు. జిల్లా తాడిపత్రికి చెందిన ఓ యువతితో అబ్బాయికి పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ పరిచయమయ్యారు. కొద్ది రోజుల వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఫోన్‌లలో ఎక్కువ సమయం గడపసాగారు. READ ALSO అమ్మాయి ఫోన్‌లోనే లీనమవుతుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకోగా ప్రేమ వ్యవహారం అని తేలింది. దాంతో కోపంతో ఊగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని పిలిచి మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని చెప్పారు. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. కానీ, అమ్మాయి సైడు వాళ్లు ఇలా మందలించారంటూ అబ్బాయి తన ఇంట్లో చెప్పాడు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా అతన్నే మందలించారు. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వివాహం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట దూరమయ్యారు. అయితే, పెళ్లయిన తర్వాత భర్త తనను సరిగా చూసుకోవడం లేదని, బాధపెడుతున్నాడని ప్రియురాలు ప్రియుడికి చెప్పింది. ప్రతీ దానికీ గొడవపడుతున్నాడని ఏడుస్తూ చెప్పింది. దాంతో ప్రియురాలి బాధను చూడలేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు బుధవారం పాయిజన్ తాగాడు. చికిత్స కోసం ఆ యువకుణ్ని కడపలోని ప్రైవేట ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ విషయమై ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.