శుభవార్త చెప్పిన బ్యాంక్- వడ్డీ రేట్లు భారీగా పెంపు- రూ. 2 లక్షలు జమ చేస్తే 501 రోజుల్లో ఎంతొస్తుంది?

Wait 5 sec.

FD Rates Hike: మీరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా? చాలా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇతర పెట్టుబడి సాధనాలు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వీటిల్లో రిస్క్ ఉంటుంది. కచ్చితమైన రిటర్న్స్ ఆశించలేం. అదే బ్యాంక్ ఎఫ్‌డీల్లో అయితే గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ముందుగా చెప్పిన వడ్డీ రేటు ప్రకారం నిర్దిష్ట పెట్టుబడులపై నిర్ణీత కాల పరిమితిలో మీకు వడ్డీ డబ్బులు అందుతాయి. గత రెండేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకుల్లో భారీగా తగ్గాయని చెప్పొచ్చు. ఆర్బీఐ కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తుండటమే ఇక్కడ కారణం. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు కూడా డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై ఆకర్షణీయ స్థాయిల్లోనే వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగానే ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంకుల కంటే అధిక వడ్డీ వస్తుంది. ఇంకా సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువగా అందుతుంది. ఇప్పుడు ఈ క్రమంలోనే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అన్నింటిపై కాకుండా కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపై వడ్డీ రేట్లు పెండడం విశేషం. తాజా నిర్ణయంతో 501 రోజుల వ్యవధి ఉన్న బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీపైనే అధిక వడ్డీ వస్తుంది. ఇక్కడ సాధారణ ప్రజలకు ఇప్పుడు అత్యధికంగా 8 శాతం, సీనియర్ సిటిజెన్లకు 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇతర డిపాజిట్లపై చూస్తే కనీసం వారం నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 4 శాతం నుంచి గరిష్ఠంగా 8 శాతం వడ్డీ రేట్లు ఉండగా, సీనియర్ సిటిజెన్లకు 4 శాతం నుంచి 8.50 శాతంగా ఉన్నాయి. Read Also: ఇప్పుడు ఈ 501 రోజుల వ్యవధి డిపాజిట్‌పై రూ. 2 లక్షలు జమ చేస్తే ఎవరికి ఎంత వస్తుందో తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజెన్స్‌కు 8 శాతం వడ్డీ ప్రకారం రూ. 2 లక్షలపై రూ. 22,577 వడ్డీ వస్తుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు 8.50 శాతం వడ్డీ రేటు చొప్పున రూ. 24,028 వడ్డీ అందుతోంది. ఈ బ్యాంకులో ఇతర అధిక వడ్డీ టెన్యూర్స్ చూస్తే 502 రోజుల నుంచి ఆపైన గరిష్ఠంగా ఐదేళ్ల వరకు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అత్యధికంగా 6.75 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. 12 నెలల డిపాజిట్లపై వరుసగా 7.50 శాతం, 8 శాతం చొప్పున వడ్డీ అందిస్తోంది. Savings Account Interest Rates:సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ రేట్లను బ్యాంక్ ప్రకటించింది. ఇక్కడ రూ. 10 లక్షలకుపైగా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసేవారికి వార్షికంగా వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. రూ. 1 లక్ష నుంచి 10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 6 శాతంగా ఉంది.