'జియో' నుంచి మరో 2 కొత్త స్కీమ్స్- సెబీకి దరఖాస్తు చేసిన అంబానీ టీమ్- కనీస పెట్టుబడి రూ. 500 మాత్రమే!

Wait 5 sec.

: దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్‌రాక్ కలిసి ఏర్పాటు చేసిన దూకుడు పెంచింది. వరుసపెట్టి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తోంది. దీంతో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనూ వేగంగా ఎదుగుతోంది రిలయన్స్ సబ్సిడరీ. ఇప్పటికే కొన్ని స్కీమ్స్‌తో ఇన్వెస్టర్ల మద్దతును కూడగట్టిన ఈ సంస్థ ఇప్పుడు డెట్, ఈక్విటీ విభాగాల్లో మరో రెండు న్యూ ఫండ్ ఆఫర్స్ (NFO) లాంఛ్ చేయబోతోంది. ఈ వారమే , జియోబ్లా‌క్‌రాక్ నిఫ్టీ50 ఈటీఎఫ్ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) ముసాయిదా పత్రాల్ని సమర్పించింది. సెబీ నుంచి దీనికి తుది అనుమతులు దక్కిన తర్వాత రెండు ఫండ్స్ NFO కింద యూనిట్లను దక్కించుకునేందుకు తేదీల్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ స్కీమ్స్ విషయానికి వస్తే జియోబ్లాక్‌రాక్ కార్పొరేట్ బాండ్ ఫండ్ అనేది ప్రధానంగా కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన స్కీమ్. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్. AA+, అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ కనీస పెట్టుబడి రూ. 500 గా ఉంటుంది. ఆపైన గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ A-II కొలమానంగా ఉంది. ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్లుగా అరుణ్ రామచంద్రన్, విక్రాంత్ మెహ్తా, సిద్ధార్థ్ దేవ్ ఉన్నారు. Read Also: ఈ ఫండ్ మొత్తం పెట్టుబడిలో 80-100 శాతం వరకు టాప్ రేటింగ్ ఉన్న సురక్షిత కార్పొరేట్ డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. 0-20 శాతం వరకు మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, 0-10 శాతం వరకు InvITs లకు కేటాయిస్తుంది. స్వల్పకాలికం నుంచి మధ్యకాలిక పెట్టుబడి కాలపరిమితి ఉండి, సురక్షితమైన మార్గంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది చక్కగా సరిపోతుందని ఫండ్ సంస్థ చెబుతోంది. ఇది ప్రస్తుతం డైరెక్ట్ ప్లాన్- గ్రోత్ ఆప్షన్‌తోనే వస్తోంది. అదే నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకం విషయానికి వస్తే ఇది నిఫ్టీ 50 ఇండెక్స్‌ను పాసివ్‌గా ట్రాక్ చేసే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇక్కడ కూడా కనీస పెట్టుబడి రూ. 500 గా ఉంది. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. ఈ స్కీమ్ పనితీరుకు కొలమానంగా నిఫ్టీ 50 TRI ఉంది. ఇక్కడ పెట్టుబడుల విషయానికి వస్తే నిఫ్టీ 50 సూచీలోని టాప్ 50 కంపెనీల ఈక్విటీ షేర్లలో 95- 100 శాతం వరకు పెట్టుబడి పెడతారు. 0-5 శాతం వరకు లిక్విడిటీ కోసం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ వృద్ధి ద్వారా సంపద సృష్టించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతోంది. ఇది పూర్తిగా ఈక్విటీ లింక్డ్ స్కీమ్ కాబట్టి మార్కెట్ ఒడుదొడుకులు/రిస్క్ ఉంటుంది. ఈ స్కీమ్ మేనేజర్లుగా తన్వి కచేరియా, ఆనంద్ షా, హరీష్ మెహ్తా వ్యవహరించనున్నారు.