గ్రాము బంగారంపై 10 వేలు లాభం.. లక్ష పెడితే రూ.4.18 లక్షలు.. RBI నుంచి కీలక ప్రకటన!

Wait 5 sec.

SGB Premeture: బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని రిటర్న్స్ అందుతున్నాయి. నేరుగా బంగారం కొనుగోలు కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన కొన్నవారికి ఊహించని రీతిలో రాబడులు, వడ్డీ డబ్బులు వస్తున్నాయి. తాజాగా జులై 16, 2019 రోజున జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్-II బాండ్ల ప్రీమెచ్యూర్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. జులై 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తు ఉపసంహరణకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ సమయం 8 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే,అందుకే గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ 2 బాండ్లు జారీ చేసి 5 ఏళ్లు పూర్తయిన క్రమంలో ముందస్తు విత్ డ్రాయల్‌కు అవకాశం ఇస్తున్నారు. ఈ బాండ్లలో లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.4.18 లక్షలు అందుతాయి. రూ.3393కే గ్రాము బంగారం కొన్నారుసావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరిస్ 2 జారీ సమయంలో ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ.3393కే లభించింది. ప్రస్తుతం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ప్రీమెచ్యూర్ ధరను ఆర్‌బీఐ ప్రకటించింది. జులై 13, జులై 14, జులై 15, 2026 రోజుల్లోని 999 ప్యూరిటీ బంగారం ధరల సగటు ఆధారంగా 1 గ్రాముకు రూ.14,199గా నిర్ణయించారు. అంటే ఈ బాండ్లపై 1 గ్రాము బంగారానికి రూ.10,806 మేర లాభం వచ్చింది. ఈ 5 ఏళ్లలో ఈ బాండ్లపై 318 శాతం లాభం వచ్చినట్లయింది. లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఆ విలువ రూ.4,18,500 వరకు అవుతుంది. ఏడాదికి 2.5 శాతం వడ్డీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 2.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ వడ్డీ డబ్బులను ఇన్వెస్టర్ ఖాతాలో జమ చేస్తారు. చివరి 6 నెలల వడ్డీని మెచ్యూరిటీ వాల్యూతో పాటు చెల్లిస్తారు. తరుచూ అడిగే ప్రశ్నలుప్రశ్న: సావెరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి, ఎవరు జారీ చేస్తారు?ఫిజికల్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిని ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది.ప్రశ్న: గోల్డ్ బాండ్లపై వడ్డీ రేటు ఎంత, ఎలా చెల్లిస్తారు?గోల్డ్ బాండ్లపై వార్షిక వడ్డీ రేటు 2.5 శాతం చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలకు ఒకసారి వడ్డీని ఇన్వెస్టర్ల ఖాతాలో జమ చేస్తారు. అయితే, 2015-16లో ఈ వడ్డీ రేటు 2.75 శాతంగా ఉండేది. ప్రశ్న: ఎస్‌జీబీ కస్టమర్లకు సర్టిఫికెట్ ఆఫ్ హోల్డింగ్ ఎప్పుడు జారీ చేస్తారు?గోల్డా బాండ్లను కొనుగోలు చేసిన సమయంలోనే కస్టమర్లకు సర్టిఫికెట్ ఆఫ్ హోల్డింగ్ జారీ చేస్తారు.