‘అఖిల్ కఠోర శ్రమ, అంకితభావమే ఈ విజయానికి బలం’.. ‘లెనిన్’పై ఏపీ మంత్రి ప్రశంసలు

Wait 5 sec.

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ‘లెనిన్’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ వివరాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అఖిల్ నటనపై ప్రశంసలు కురిపిస్తూనే, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. “ప్రముఖ నటుడు అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచిన శుభసందర్భంగా గుంటూరులో నిర్వహించిన విజయోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. గ్రామీణ నేపథ్యంతో, విలువలతో కూడిన కథను ప్రేక్షకులకు అద్భుతంగా అందించిన దర్శకుడు మురళి కిషోర్ గారికి, నిర్మాతలు అక్కినేని నాగార్జున గారికి, సూర్యదేవర నాగవంశీ గారికి, హీరో అక్కినేని అఖిల్ గారికి అలాగే చిత్ర బృందం అంతటికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను”Read Also: “అఖిల్ గారి కఠోర శ్రమ, అంకితభావం, అద్భుత నటన ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇలాంటి నాణ్యమైన చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందడం తెలుగు సినీ పరిశ్రమకు శుభపరిణామం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులను ప్రోత్సహించే సమగ్ర జీవో ద్వారా రాష్ట్రాన్ని సినీ నిర్మాణానికి అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నాం” “ఈ సందర్భంగా ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 'అమరావతి చిత్ర కళావీధి' కార్యక్రమ పోస్టర్‌ను హీరో అఖిల్ గారు, చిత్ర బృందం, సాంస్కృతిక & సృజనాత్మక సమితి చైర్ పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటితో కలిసి ఆవిష్కరించడం జరిగింది” అని మినిస్టర్ కందుల దుర్గేష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. * ‘లెనిన్’ ఈవెంట్ లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు నేలపై తెలుగు చిత్ర పరిశ్రమ వెలుగొందాలని ఆకాంక్షించారు. సినీ స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోల నిర్మాణం కోసం ప్రభుత్యం స్థలం కేటాయిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే, సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.