అమెరికా కొత్త బిల్లుతో భారత్‌కు షాక్- 100 శాతం సుంకాల మోత!- మోదీ సర్కార్ సీరియస్

Wait 5 sec.

: ప్రపంచ చమురు మార్కెట్లో మరోసారి అలజడి మొదలైంది. రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెనేటర్లు తీసుకొచ్చిన సంచలన బిల్లు- ఇప్పుడు భారత్- అమెరికా స్నేహ సంబంధాలకే పరీక్ష పెడుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా 100 శాతం టారిఫ్స్ బాదుతామని అమెరికా హెచ్చరిస్తోంది. అయితే ఇదే సమయంలో రష్యా నుంచి సహజ వాయువు కొనే ఐరోపా దేశాలకు మాత్రం మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. అమెరికా అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానంపై భారత్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. గతంలోనే రష్యా చమురు కొంటున్న దేశాలపై టారిఫ్స్ భారీగా విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సెనేటర్ల బిల్లుకు కూడా మద్దతు తెలిపారు. అయితే . ఇది భారత్ వంటి దేశాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఇండియా ఎక్కువగా రష్యా నుంచే చమురును కొనుగోలు చేస్తోంది. అమెరికా క్యాపిటల్ హిల్‌లో సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంటల్, జీన్ షాహీన్‌తో కూడిన బృందం మంగళవారం రోజు ఈ బిల్లును అధికారికంగా ప్రకటించింది. బిల్లు ప్రధాన నిబంధనలు చూస్తే రష్యా ఆయిల్ కొనే అతిపెద్ద కొనుగోలుదారులపై 100 శాతం వరకు అదనపు టారిఫ్స్ విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ బిల్లు కింద అమెరికా లక్ష్యంగా ఉన్న దేశాల్లో భారత్ సహా చైనా, స్లొవేకియా, అజర్‌బైజాన్, హంగేరి. అయితే ఇక్కడ రష్యా నుంచి 15 శాతం కంటే తక్కువ గ్యాస్ దిగుమతి చేసుకుంటూ, కొనుగోళ్లు తగ్గిస్తున్న దేశాలకు (యూరప్ మిత్రదేశాలకు) ఈ నిబంధన వర్తించదు.Read Also: అయితే అమెరికా తెచ్చిన ఈ బిల్లుపై భారత ప్రభుత్వ సీనియర్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల అమెరికాకు ఆశించిన ఫలితం అందకపోగా, భారత్‌తోనూ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై ఆధారపడితే తప్పులేదు గానీ భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యా ఆయిల్ కొంటే ఆంక్షలు విధిస్తారా అని భారత్ ప్రశ్నిస్తోంది. అమెరికా విదేశాంగ విధాన వైఫల్యాలకు భారత్‌ను మధ్యలో ఇబ్బంది పెట్టడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, చైనా ఎలాగోలా రష్యా ఆయిల్ కొంటూనే ఉంటుందని, దీంతో చివరకు నష్టపోయేది ప్రజాస్వామ్య దేశాల స్నేహ బంధమేనని గుర్తు చేస్తున్నారు. భారత్- అమెరికా మధ్య ముఖ్యంగా వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ కాలంగా చర్చలు జరుగుతున్నా ఇప్పటికీ ఒప్పందం ఖరారు కాలేదు. ఈ సమయంలో ఈ బిల్లు రావడం డీల్‌ను ఆలస్యమయ్యేలా చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.