కొత్త కారు కొన్నారా? కేంద్రం మీ డబ్బులు తిరిగి ఇస్తుంది.. ఈ ఒక్క పని చేస్తే చాలు!

Wait 5 sec.

TCS On Car: సొంత కారు ఉండాలని చాలా మంది కలలుగంటారు. అందుకోసం లోన్ తీసుకుంటారు. డౌన్‌పేమెంట్, ఇన్సూరెన్స్ వంటి అంశాలను పలుమార్లు తనిఖీ చేస్తుంటారు. అయితే, తాము కొన్న కారు కోసం అదనంగా చెల్లించిన పన్నును తిరిగి పొందవచ్చనే విషయాన్ని చాలామందికి తెలియదు. తెలిసినవారిలోనూ చాలా మంది మర్చిపోతుంటారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం మీరు కొనుగోలు చేసిన కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10 లక్షలు దాటితే ఈ మొత్తాన్ని మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు రీఫండ్ రూపంలో వెనక్కి పొందవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. కనీసం రూ.10 వేలు వస్తాయిఉదాహరణకు మీరు కొన్న కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10 లక్షలు ఉందని అనుకుందాం. అప్పుడు డీలర్ మీ నుంచి రూ.10 వేలు టీసీఎస్ కట్ చేస్తారు. అదే మీ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.20 లక్షలుగా ఉంటే అప్పుడు 1 శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనేది రూ.20 వేలు అవుతుంది. మీకు ఎలాంటి పన్ను బాధ్యత (Tax Liability) లేకపోతే ఈ రూ.10 వేలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని ఐటీ రిటర్నులు ఫైల్ చేసి పూర్తిగా రీఫండ్ పొందవచ్చు. ఒక వేళ మీరు పన్ను కట్టాల్సిన అవసరం ఉంటే ఈ అమౌంట్ అందులో మినహాయించేలా చూడవచ్చు. TCS కట్ అయినట్లు ఎక్కడ తనిఖీ చేయాలి? డీలర్ పన్నును ప్రభుత్వానికి జమ చేశాక అది మీ ఫామ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)లలో కనిపిస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ముందే ఈ ఫారాలలో మీ కారు టీసీఎస్ అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో సరిచూసుకోవాలి. రీఫండ్ క్లెయిమ్ చేసే ప్రాసెస్ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలిఫారం 26ఏఎస్, ఏఐఎస్ డౌన్‌లోడే చేసుకుని కారుపై విధించిన 1 శాతం టీసీఎస్ నమోదు చేశారా లేదా తనిఖీ చేయాలి. మీ కారు డీలర్ నుంచి ఫామ్ 27డీ (టీసీఎస్ సర్టిఫికెట్) తీసుకోవాలి. మీకు అదే అధికారిక రుజువుఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ట్యాక్సెస్ పెయిడ్ కాలమ్‌లో ఈ టీసీఎస్ మొత్తాన్ని ఎంటర్ చేయండిమీరు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేశాక సిస్టమ్ ఆటోమేటిక్ గా మీ పన్నును లెక్కగట్టి మిగిలిన అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో రీఫండ్ చేస్తుంది.