ఒక్కరోజే 7 బ్యాంకుల నుంచి ప్రకటన.. లిస్టులో HDFC, పీఎన్‌బీ.. క్యూ1లో వేల కోట్ల లాభాలు!

Wait 5 sec.

Banks Q1 Results 2026: దేశీయ బ్యాంకింగ్ రంగంలోని ఏడు ప్రముఖ ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఒకే రోజు తమ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలను అధికారికంగా ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి దిగ్గజాలు ఊహించనిన దానికంటే మెరుగైన లాభాలను నమోదు చేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ బ్యాంకుల షేర్లు ఫోకల్‌లో ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌పై ఈ ఫలితాల ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉందని తెలిపాయి. ఈ క్రమంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన బ్యాంకుల వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.HDFC బ్యాంక్ లాభం రూ.19,060 కోట్లునమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.18,155 కోట్లతో పోలిస్తే 5 శాతం పెరిగింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.92,184 కోట్లుగా చూపించింది. నికర వడ్డీ ఆదాయం 7 శాతం పెరిగి రూ.33,530 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.26 శాతానికి పెరిగినట్లు తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.4 శాతం నుంచి 1.17 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 0.47 శాతం నుంచి 0.41 శాతానికి తగ్గింది.22 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ లాభంయాక్సిస్ బ్యాంక్ క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో రూ.7532.21 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,243.72 కోట్లతో పోలిస్తే 22 శాతం పెరిగింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 23 శాతం పెరిగి రూ.7,114 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.14,646 కోట్లకు చేరింది. రుణాలు 19 శాతం పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ.7,258 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.6,735 కోట్లకు పరిమితమైంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో రూ.331 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,546 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.2,911 కోట్ల నుంచి రూ.3,213 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.900 కోట్ల నుంచి 15 శాతం పెరిగి రూ.1038 కోట్లుగా నమోదు చేసింది.3 రెట్లు పెరిగిన పీఎన్‌బీ లాభంజూన్ తో ముగిసిన త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదినక రూ.5,253 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంక్ కొత్త పన్ను విధానంలోకి మారడంతో రూ.3,358 కోట్ల చెల్లింపులు తగ్గాయి. మొత్తం ఆదాయం రూ.37,231 కోట్లగు చూపించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.10,798 కోట్లకు చేరుకుంది.ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.15000 కోట్లుకీకృత నికర లాభం రూ.15,440 కోట్లుగా చూపించింది. గతేడాదితో పోలిస్తే ఇది 13.88 శాతం అధికం. స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ.12,768 కోట్ల నుంచి 16 శాతం పెరిగి రూ.14,804 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 12.7 శాతం పెరిగి రూ.24,384 కోట్లకు చేరింది. యెస్ బ్యాంకుకు వడ్డీ ఆదాయం అండయెస్ బ్యాంక్ నికర లాభం 32.54 శాతం పెరిగి రూ.1071.80 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 17.5 శాతం పెరిగి రూ.2,786 కోట్లుగా చూపించింది. నికర వడ్డీ మార్జిన 2.5 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది. మొత్తం డిపాజిట్లు రూ.2.76 లక్షల కోట్ల నుంచి 14.3 శాతం పెరిగి రూ.3.15 లక్షల కోట్లకు చేరాయి. కోటక్ బ్యాంకు లాభంజూన్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.5,480.46 కోట్ల నికర లాభం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 22.60 శాతం పెరిగింది. స్టాండలోన్ ప్రకారం చూస్తే బ్యాంక్ లాభం రూ.4,122,96 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.7,928 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన 4.65 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గింది. మొత్తం డిపాజిట్లు 14 శాతం పెరిగి రూ.5,59 లక్షల కోట్లకు చేరాయి.