ఆహార, ఔషధ కల్తీలకు చెక్.. త్వరలోనే అత్యంత కఠిన చట్టం, సీఎం కీలక ఆదేశాలు

Wait 5 sec.

తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి ప్రతీ రంగంలో వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రతిపాదిత , ఔషధ నియంత్రణ చట్టం(TGFADCA) పై ముఖ్యమంత్రి శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారని ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మండిపడ్డారు.ఈ కల్తీ ప్రభావం కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయంగానూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని దీనివల్ల కొన్ని దేశాలు మన ఉత్పత్తుల దిగుమతులను నిరాకరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తుల పేరిట విక్రయిస్తున్న వస్తువులను ప్రజలు భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని అయితే అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అని నిర్ధారించేందుకు రాష్ట్రంలో సరైన వ్యవస్థలు లేకపోవడాన్ని తప్పుబట్టారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు విజయవంతంగా అమలులో ఉన్న వివిధ దేశాలను సందర్శించి, అక్కడి విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను రూపొందించి త్వరలోనే శాసనసభలో దీనిపై విస్తృత చర్చ చేపట్టి కొత్త బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. కేవలం సభలోనే కాకుండా.. ఈ చట్టంపై ప్రజల నుంచి కూడా సెంటిమెంట్లు, అభిప్రాయాలు సేకరించాలని సూచించారు.సమాజంలో కల్తీ మూలాలను తొలగించేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కల్తీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఒక ప్రత్యేక విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కొత్త నిబంధనలను, నియంత్రణ చర్యలను తొలుత క్యూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని.. అక్కడ ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.