ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 2-0తో ఘన విజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కిలియన్ నేతృత్వంలోని బలమైన ఫ్రాన్స్ జట్టును స్పెయిన్ తన వ్యూహాత్మక ఆటతీరుతో పూర్తిగా అవుట్‌క్లాస్ చేసింది. ఈ అద్భుత గెలుపుతో స్పెయిన్ జట్టు ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే రెండోసారి ఫైనల్ చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.మ్యాచ్ ప్రారంభమైన మొదటి హాఫ్‌లోనే స్పెయిన్ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా స్పెయిన్ వండర్ కిడ్, టీనేజ్ సంచలనం లామిన్ మైదానంలో తన అమోఘమైన స్మార్ట్ ప్లేతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫ్రాన్స్ డిఫెండర్లను ముప్పతిప్పలు పెడుతూ యమల్ సృష్టించిన ఒక అద్భుతమైన అవకాశం స్పెయిన్‌కు పెనాల్టీ తెచ్చిపెట్టింది. ఈ లభించిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా స్పెయిన్ స్టార్ ప్లేయర్ మైకెల్ ఒయర్జబల్ ఫస్ట్ హాఫ్‌లోనే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో స్పెయిన్ బృందం సంతోషంగా మునిగితేలింది.సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఎలాగైనా గోల్ సమం చేయాలని ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ లైన్ దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ క్రమంలోనే స్పెయిన్ జట్టు కౌంటర్ అటాక్‌కు దిగింది. మ్యాచ్ ద్వితీయార్థంలో స్పెయిన్ ఆటగాడు పెడ్రో పోర్రో లూజ్.. మెరుపు వేగంతో మరో సూపర్ గోల్ సాధించాడు. ఈ గోల్‌తో స్పెయిన్ విజయం దాదాపు ఖరారైపోయింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. దీంతో 2-0తో స్పెయిన్ విజయఢంకా మోగించింది. చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది.ఈ ఓటమితో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. మరోవైపు 2010లో మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్, ఇప్పుడు 2026లో రెండోసారి ట్రోఫీని ముద్దాడేందుకు అడుగుదూరంలో నిలిచింది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్, అర్జెంటీనా తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది.