ఏకంగా 36 శాతం ప్రీమియంతో ఐపీఓ ఎంట్రీ, మళ్లీ అప్పర్ సర్క్యూట్- ఒక్కో లాట్‌పై రూ. 7 వేలకుపైగా లాభం!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 140 పాయింట్లు పుంజుకుంది. అయితే ఇదే సమయంలో ఒక ఐపీఓ కాసుల పంట పండిస్తోంది. అదిరిపోయే ప్రీమియంతో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. అదే పారిశ్రామిక దుస్తుల తయారీ దిగ్గజ సంస్థ కుసుమ్‌గార్ లిమిటెడ్. అందించింది. ఇష్యూ ప్రైస్ కేవలం రూ. 419 గా ఉండగా జులై 15న NSE లో నేరుగా 36 శాతం ప్రీమియంతో రూ. 569 వద్ద లిస్టయింది. ఇక్కడ ఒక్కో షేరుపైనే రూ. 150 పెరిగిందన్నమాట. దీంతో ఈ ఐపీఓలో సక్సెస్‌ఫుల్‌గా షేర్లు అలాట్ అయిన వారు పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. బీఎస్ఈలో 37 శాతం ప్రీమియంతో రూ. 574 వద్ద ఎంట్రీ ఇచ్చింది.ఈ ఐపీఓ దలాల్ స్ట్రీట్ అంచనాల్ని అందుకోవడం విశేషం. సుమారు 38.42 శాతం ప్రీమియంతో రూ. 580 వద్ద లిస్టింగ్ అవుతుందని భావించగా దాదాపు అదే స్థాయిలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇవాళ లిస్టింగ్‌తోనే అయిపోలేదు. తర్వాత మరింత దూసుకెళ్లింది. లిస్టింగ్ ప్రైస్ నుంచి మళ్లీ 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి ఇంట్రాడేలో రూ. 625.90 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. ఈ గరిష్ఠ స్థాయి దగ్గర చూస్తే ఒక్కో షేరుపై ఏకంగా రూ. 206.9 లాభం వచ్చింది. ఈ లెక్కన దాదాపు 50 శాతం లాభాలు రావడం విశేషం. అంటే ఇష్యూ ప్రైస్ దగ్గర్నుంచి 50 శాతం వరకు గెయిన్స్ అందించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జులై 8- 10 మధ్య జరిగింది. ఓవరాల్‌గా 3 రోజుల్లో ఏకంగా 136 రెట్ల మేర బిడ్స్ దాఖలయ్యాయి. అంతకుముందు అద్విత్ జువెల్స్ ఐపీఓకు 200 రెట్లకుపైగా సబ్‌స్క్రిప్షన్ రాగా ఇది కూడా అదే బాటలో పయనించింది. మంచి లాభాల్ని అందించింది. ఇక్కడ పెట్టుబడి, రాబడి విషయానికి వస్తే ఒక లాట్ కింద 35 షేర్లను కేటాయించగా రూ. 419 ఇష్యూ ప్రైస్ దగ్గర కనీస పెట్టుబడి రూ. 14,665 గా ఉంది. ఇక్కడ లిస్టింగ్‌తో చూస్తే అంటే రూ. 569 దగ్గర నేరుగా రూ. 19,915 గా రాబడి వచ్చింది. అంటే లిస్టింగ్‌తో రూ. 5,250 లాభాలు వచ్చాయి. మళ్లీ అప్పర్ సర్క్యూట్ ప్రైస్ రూ. 625.90 దగ్గర చూస్తే ఇది రూ. 21,906.50 కు చేరగా లాభమే రూ. 7241.50 గా ఉంది. ఇది పెట్టుబడిలో దాదాపు 50 శాతం అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు 47 శాతం లాభంతో రూ. 615 వద్ద ట్రేడవుతోంది.