: భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరో పెద్ద డీల్‌పై ప్రకటన చేసింది. అమెరికా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో న్యూ టెర్మినల్ వన్ ప్రాజెక్ట్ కోసం ఈ సంస్థే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ మేరకు టీసీఎస్ మంగళవారం రోజు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ కాంట్రాక్టులో భాగంగా టీసీఎస్- టెర్మినల్ అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల్ని నిర్మిస్తుంది. ఇంకా విమానశ్రయ నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఐటీ కార్యకలాపాల్ని ప్రవేశపెడుతుంది. ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చడంలో భాగంగా బయోమెట్రిక్ విధానాలు, లగేజ్ ట్రాకింగ్, సులభతర చెక్ ఇన్ ప్రక్రియల వంటి ప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్స్‌లో ప్రయాణికులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందిస్తుంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించడంలో భాగంగా టీసీఎస్ ఇక్కడ తన సొంత Cognix, Ignio ప్లాట్‌ఫారంలను ఉపయోగించనుంది.Read Also: టీసీఎస్ అందించే సేవలుప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ఏఐ ఆధారిత ఐటీ ఆపరేషన్స్సైబర్ సెక్యూరిటీ సర్వీసులుఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ఇక ఈ జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్‌పోర్ట్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్ మొత్తం విలువ 19 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపు రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. దీంట్లో భాగంగా నిర్మిస్తున్న న్యూ టెర్మినల్ వన్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ. 91 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీసీఎస్ డీల్ విలువను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల క్యూ1 ఫలితాల్లో రాణించిన తర్వాత టీసీఎస్ షేరు 5 రోజుల్లో 5 శాతం వరకు పెరిగింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం 5 శాతం పెరిగి రూ. 13,349 కోట్లుగా నమోదవగా, ఆదాయం 14 శాతం పెరిగింది. ఆర్డర్ బుక్ కూడా సమీక్షా త్రైమాసికంలో 9.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించిందీ ఐటీ దిగ్గజం. ఇప్పుడు మరో భారీ డీల్ సొంతం చేసుకుంది. ఈ డీల్ నేపథ్యంలో కిందటి రోజు కూడా ఒక దశలో నష్టాల్లో ఉన్న స్టాక్ ధర చివరకు స్వల్ప లాభాల్లో ముగిసింది. ఈ డీల్‌తో టీసీఎస్‌కు పూర్వవైభవం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నా ప్రస్తుతం బుధవారం సెషన్‌లో మాత్రం మళ్లీ స్టాక్ నష్టాల్లోనే ఉంది. ఉదయం 9.40 గంటలకు 1.40 శాతం వరకు నష్టంతో రూ. 2170 స్థాయిలో ఉంది. మార్కెట్ విలువ రూ. 7.85 లక్షల కోట్లుగా ఉంది.