: ఐటీ రిటర్న్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కాస్త పెద్ద వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్‌ పట్ల కూడా అన్ని విషయాల్ని తెలుసుకోవాలి. చాలా మంది తాము సాధారణ ఉద్యోగులమే కదా మనకెందుకు వస్తాయని భావిస్తుంటారు. కానీ మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనం చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఐటీ శాఖ నిఘాకు చిక్కుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 6 లక్షలే అయినా, కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. కానీ అతడి బ్యాంక్ డిపాజిట్లు రూ. 20 లక్షలుగా ఉన్నాయనుకోండి ఆ భారీ వ్యత్యాసం కారణంగా ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది.అందుకే మీరు ఐటీ శాఖ దృష్టిలో పడకుండా ఉండాలంటే ఏయే లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఇక్కడ అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి ఒక లిమిట్ దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొన్ని కేసుల్లో ఇది జైలు శిక్షకు కూడా దారితీయొచ్చు.Read Also: సేవింగ్స్ అకౌంట్లో నగదు జమ- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంకులు నేరుగా ఐటీ శాఖకు నివేదిస్తాయి.కరెంట్ అకౌంట్లో నగదు లావాదేవీలు- ఇక్కడ ఏడాదిలో రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ కరెంట్ ఖాతాలో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్స్ జరిగితే బ్యాంకులు రిపోర్ట్ చేస్తాయి.క్రెడిట్ కార్డ్ బిల్లు- క్యాష్ పేమెంట్స్- క్రెడిట్ కార్డు బిల్లును ఏడాదిలో రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ రూపంలో చెల్లిస్తే అది కూడా తక్షణమే ఐటీ రాడార్‌లోకి చేరుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్ ఆన్‌లైన్ పేమెంట్- ఒక సంవత్సరంలో నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ కార్డ్ బిల్లులు చేస్తే ఐటీ శాఖ వివరాలు కోరొచ్చు.ఫిక్స్‌డ్ డిపాజిట్లు- ఒకేసారి లేదా ఏడాదిలో కలిపి రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఎఫ్‌డీ చేస్తే ఈ సమాచారం కూడా ఐటీ శాఖకు చేరుతుంది. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్- రూ. 30 లక్షలు పైబడిన స్థలం లేదా ఇల్లు కొనుగోలు/అమ్మకం వివరాల్ని రిజిస్ట్రార్ ఆఫీస్ ఐటీ విబాగానికి పంపుతుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు- మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు, డిబెంచర్లలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆయా సంస్థలు రిపోర్ట్ చేస్తాయి.విదేశీ ప్రయాణాలు, చెల్లింపులు- విదేశీ కరెన్సీ కొనుగోలు లేదా విదేశీ ప్రయాణాల కోసం, అంతర్జాతీయ లావాదేవీల కోసం రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ ఉంటే నిఘా ఉంటుంది. డార్మెంట్ ఖాతాల్లో అకస్మాత్తుగా డిపాజిట్లు- చాలా కాలం పాటు వాడకుండూ మూలనపడ్డ అకౌంట్లో ఒక్కసారిగా భారీ స్థాయిలో లావాదేవీలు జరిగితే ఇక్కడ కూడా బ్యాంక్ అలర్ట్ అయి ఐటీ శాఖకు సమాచారం అందిస్తుంది. చిన్న చిన్న వడ్డీ ఆదాయాల్ని దాచడం- సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్‌డీలపై వచ్చే చిన్నపాటి వడ్డీ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపకపోతే, పాన్ ఆధారంగా ఐటీ శాఖ ఇట్టే గుర్తిస్తుంది.ఇక్కడ ఐటీ నోటీసుల నుంచి తప్పించుకునేందుకు గిఫ్ట్ డీడ్స్, ఆస్తి అమ్మకం పత్రాలు, లోన్ రికవరీ వంటి సరైన ఆధారాలు ఉంటే నోటీసులు వచ్చినా ఈజీగా సమాధానం ఇవ్వొచ్చు. రూ. 10 లక్షల పరిమితి దాటకుండా ఉండేందుకు రూ. 2 లక్షల చొప్పున పలుమార్లు డిపాజిట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పాన్ కార్డుకు సంబంధించిన అన్ని లావాదేవీల్ని ఐటీ శాఖ చూస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మరింత అనుమానం రావొచ్చు.Read Also: ఐటీ శాఖ నుంచి నోటీసుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే 50 నుంచి 200 శాతం వరకు పెనాల్టీ పడుతుంది. ఇంకా దీనిపై వడ్డీ కూడా పడుతుంది. కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే, మీ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉంటే జైలు శిక్ష కూడా పడొచ్చు. కాబట్టి పైలావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించడం మంచిది.