పవన్ కళ్యాణ్ సర్జరీ ఖర్చు.. సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం ముంబైలో సర్జరీ చేయించుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కుడి భుజానికి (రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ) సర్జరీ విజయవంతంగా జరిగింది. వరల్డ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా అండ్ డాక్టర్స్ టీమ్ మూడుగంటలకుపైగా ఈ సర్జరీని చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.. ఆయన మెల్లిగా కోలుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు.. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. సోషల్ మీడియా వేదికగా పవన్ సర్జరీ ఖర్చుపై ఓ ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించుకునే అవకాశం ఉన్నా సరే.. ఆయన మాత్రం తన సొంత డబ్బులతో ముంబైలో సర్జరీ చేయించుకున్నారంటూ జనసైనికులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సర్జరీకి సంబంధించి ఖర్చు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తన సర్జరీ కోసం అయ్యే వైద్య ఖర్చులకు తన సొంత డబ్బులు ఇచ్చారని జనసైనికులు, అభిమానులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి.. ఈ చికిత్స కోసం ప్రభుత్వ నిధుల్ని ఉపయోగించుకోవచ్చు.. కానీ ఆ ఖర్చుల్ని ఆయనే భరించారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇలా చేశారంటున్నారు. ప్రభుత్వ కవరేజ్ పూర్తిగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకోకుండా.. తన సొంత డబ్బుతో సర్జరీ చేయించుకుంటున్నారంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఇప్పటి వరకు సర్జరీకి సంబంధించి ఖర్చుల అంశంపై అటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రైవేట్ ఆస్పత్రి కావడం, వ్యక్తిగతమైనది కావడంతో ఈ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని చెబుతున్నారు. డి నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్లుగా భుజాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరగా వెళ్లాలని, కరచాలనం చేయాలని చాలామంది అభిమానులు ఉత్సాహంతో వచ్చేవారు. ఆ సమయంలో వారు పవన్ కళ్యాణ్ చేతుల్ని లాగేవారు.. దీంతో ఆయన భుజాలకు గాయాలు అయ్యాయి. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకుంటున్నప్పుడు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అప్పుడే డాక్టర్లు వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు వారాల క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి భుజాలకు సంబంధించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీలైనంత ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు.. అప్పటికే పవన్ కళ్యాణ్ హాజరుకావాల్సిన అధికారిక కార్యక్రమాలు ఉండటంతో.. వాటిని ముగించిన తర్వాత సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ డాక్టర్లకు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 10న ముంబై వెళ్లారు.. అ నెల 11న కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు.. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వాస్తవానికి డాక్టర్లు రెండు భుజాలకు ఆపరేషన్ చేయాలన్నారు. కానీ రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే నొప్పి భరించలేరని డాక్టర్లు తెలిపారు. అందుకే ముందుగా కుడి భుజానికి ముందుగా ఆపరేషన్ చేశారు. మరో రెండు నెలల వ్యవధిలో ఎడమ భుజానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.