సామాన్యులకు షాక్- ఏకంగా 18 నెలల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం- దేశంలో తెలంగాణలోనే ధరలెక్కువ!

Wait 5 sec.

: మార్కెట్లో మళ్లీ నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (MoSPI) తాజాగా విడుదల చేసిన వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత డేటా దీనికి అద్దం పడుతోంది. 2024 ను బేస్ ఇయర్‌గా తీసుకొని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కొత్త సిరీస్‌లో ద్రవ్యోల్బణం 4 శాతం దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే నెలలో 3.93 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నాటికి 4.38 శాతానికి ఎగబాకింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం ద్రవ్యోల్బణాన్ని పెంచడంలో కీలకంగా ఉన్నాయి. ఇక జూన్ నెలలో నమోదైన ద్రవ్యోల్బణం ఏకంగా 18 నెలల గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 4.74 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.92 శాతంగానే ఉంది. దీనిని బట్టి చూస్తే పట్టణాల్లోనే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలోనే అధిక ద్రవ్యోల్బణంరాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 6.36 శాతంగా ఉండగా ధరలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అత్యల్పంగా ద్రవ్యోల్బణం మిజోరంలో (1.63 శాతం) నమోదైంది. అంటే ఇక్కడ ధరలు తక్కువగానే ఉన్నాయన్నమాట.Read Also: తెలంగాణలో అధిక ద్రవ్యోల్బణం ఉందంటే దీని గురించి సులభంగా చెప్పాలంటే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే నిత్యావసర వస్తువులు, సేవల ధరలు చాలా వేగంగా పెరిగాయన్నమాట. ఉదాహరణ లెక్కన చూస్తే గతేడాది జూన్ నెలలో తెలంగాణలో ఒక సామాన్యుడు తన నెలకు సరిపడా సరకుల కోసం రూ. 10 వేలు ఖర్చు చేస్తే ఈ జూన్‌లో అదనంగా 6.36 శాతం అంటే రూ. 636 అధికంగా ఖర్చు చేశాడని చెప్పొచ్చు. ఇక్కడ ద్రవ్యోల్బణం పెరగడాన్ని 2 రకాలుగా చూడొచ్చు. సామాన్యుడి కోణంలో చూస్తే మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. చేతిలో ఉండే పొదుపు తగ్గుతుంది. అదే ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా సాగుతున్నాయని, ప్రజల్లో వస్తువుల్ని కొనే శక్తి బాగుందని కూడా ఇది సూచిస్తుంది. అయినప్పటికీ ఇది ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి నియంత్రించాల్సిన అవసరం ఉంది.Read Also: భారీగా ధరలు పెరిగిన, తగ్గిన వస్తువులు ఇవేధరలు పెరిగిన వస్తువుల్లో చూస్తే వెండి ఆభరణాల్లో అత్యధికంగా 133.2 శాతం వృద్ధి నమోదైంది. అల్లం వార్షిక ప్రాతిపదికన 50.41 శాతం పెరిగింది. బంగారం, ప్లాటినం, వజ్రాభరణాల ధరలు 36.82 శాతం పెరిగాయి. టమాటా ధరలు 31.92 శాతం పెరిగాయి. కిస్మిస్ ధరలు 20.52 శాతం వరకు పుంజుకున్నాయి. ధరలు తగ్గిన వాటిల్లో బంగాళాదుంపలు (-20.3 శాతం), బఠానీలు (-9.67 శాతం), జీలకర్ర (జీరా) ధరలు గతేడాదితో పోల్చితే తగ్గాయి. మోటార్ కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిల్స్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.