తెలివైన పెట్టుబడి.. రూ.4800లకే గ్రాము బంగారం కొన్నారు.. ఇప్పుడు 2 లక్షల లాభం, ఆపై వడ్డీ పొందుతున్నారు..!

Wait 5 sec.

Gold Bond Magic: భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. తమకు స్తోమతకు తగినట్లుగా వీలైనప్పుడల్లా బంగారం కొంటూనే ఉంటారు. అయితే, ఫిజికల్ గోల్డ్ (నగలు, నాణేలు, బిస్కెట్లు) కంటే డిజిటల్ రూపంలో ఉండే సావరిన్ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన మరోసారి నిరూపించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై 14, 2020 రోజున జారీ చేసిన సావెరిన్ గోల్డ్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్‌- IVకు సంబంధించిన ముందస్తు విత్ డ్రాయల్ ధరను ఖరారు చేసింది. ఈ సిరీస్ ప్రారంభంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సంప్ద ఇప్పుడు ఏకంగా 3 రెట్లు పెరగడం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ బాండ్ ప్రీ-మెచ్యూర్ రిడంప్షన్ వివరాలు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ప్రకారం సార్వభౌక పసిడి బాండ్లు 2020-21 సిరీస్-4 ముందస్తు విత్ డ్రాయల్ అనేది జులై 14, 2026 నుంచి చేసుకునేందుకు అవకాశం లబించింది. సాధారణంగా గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు ఉంటుంది. అయితే 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సావెరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 4 బాండ్లకు 5 ఏళ్ల పీరియడ్ ముగిసిన క్రమంలో అవకాశం ఇస్తున్నారు. ఒక్కో గ్రాముకు ధర ఎంత?అంటే జులై 9, జులై 10, జులై 13,2026 తేదీల్లోని బంగారం ధరల సగటు ఆధారంగా ఈ ధరను నిర్ణయించారు. ఎస్‌జీబీ 2020-21 సిరీస్ 4 బాండ్లను జారీ చేసినప్పుడు ఒక గ్రాముకు రూ.4,802 చొప్పున ఆన్‌లైన్లో విక్రయించారు. దీని ప్రకారం చూసుకుంటే 198 శాతం మేర లాభం వచ్చినట్లవుతుంది. అంటే ఒక్క గ్రాముపైనే రూ.9,505 మేర లాభం వచ్చింది. ఇందులో రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.2,97,900 వరకు వస్తాయి. బంగారం ధరలు గత ఏడాది కాలం నుంచి భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభం వస్తోంది. అంతే కాదు ఆపైన వడ్డీ సైతం లభిస్తుంది. సావెరిన్ గోల్డ్ బాండ్ల పెట్టుబడిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షికంగా 2.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంది. లక్ష రూపాయల పెట్టుబడి 5 ఏళ్ల కాలానికి కాను ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ సైతం చెల్లిస్తారు. సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఇన్వెస్టర్ల ఖాతాలో జమ చేస్తారు. చివరి వడ్డీని మొత్తం అసలుతో కలిపి చెల్లిస్తారు.