లార్డ్స్‌లో పోరాడి ఓడిన భారత్.. వన్డే సిరీస్ 2-1తో ఇంగ్లాండ్ సొంతం..!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. లార్డ్స్‌లో జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచులో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. 0-4తో బ్రూక్ సేన చేతిలో ఓటమి చవిచూసింది. మొత్తంగా ఈ పర్యటనలో భారత్.. ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది.ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ బెన్ డకెట్ (141) సెంచరీ చేయగా, జాకబ్ బెథెల్ (91), జో రూట్ (48 బంతుల్లో 74 నాటౌట్) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్.. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. గిల్, రోహిత్ కలిసి తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ ఓ దశలో 38.3 ఓవర్లలో 260/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ సమయంలో సామ్ కర్రన్ భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. వైవిధ్యంగా బంతులేసిన అతడు.. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ను ఔట్ చేశాడు. దీంతో కాస్త ముందుగానే ఖరారైంది. చివరకు టీమిండియా 50 ఓవర్లలో 360 పరుగులు చేసింది. 20 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది.ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచులో భారత్ గెలవగా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచులలో ఇంగ్లాండ్ జయకేతనం ఎగురవేసింది. ఇక ఈ సిరీస్ కోల్పోయినా.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం కాస్త ఊరటనిచ్చింది.