రోహిత్ పని అయిపోయింది. లార్డ్స్ వన్డే తర్వాత .. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడు. ఇక వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే అతడి కల నెరవేరదు.. ఇవి భారత్, ఇంగ్లాండ్ లార్డ్స్ వన్డేకు ముందు వినిపించిన ఊహాగానాలు, వార్తలు. కానీ వీటన్నిటికి ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టేశాడు హిట్ మ్యాన్. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలో పరుగుల వరద పారిస్తున్న అతడు.. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో 84 బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు. విమర్శకులకు తన ఆటతో సమాధానం చెప్పేశాడు.ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల వేటగాడిగా పేరు తెచ్చుకున్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో మరొక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఒక విదేశీ దేశంలో పర్యటించి, అక్కడ అత్యధిక వన్డే అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో శతక్కొట్టిన రోహిత్ శర్మ.. ఇంగ్లీష్ గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. తన ఖాతాలో 8వ సెంచరీ వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లోనే రోహిత్ ఐదు సెంచరీలు బాదడం గమనార్హం. అంతేకాకుండా వన్డేల్లో లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత్ ప్లేయర్‌ కూడా రోహిత్ శర్మనే.విదేశీ గడ్డపై అత్యధిక వన్డే శతకాలు చేసిన ప్లేయర్లు..8 - ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ7 - యూఏఈలో సచిన్ టెండూల్కర్7 - యూఏఈలో సయీద్ అన్వర్7 - భారత్‌లో ఏబీ డివిలియర్స్7 - భారత్‌లో క్వింటన్ డికాక్ఇంగ్లాండ్‌లో జో రూట్ (10) మాత్రమే ఎక్కువ వన్డే శతకాలు సాధించాడు. మార్కస్ ట్రెస్కోథిక్ ఎనిమిది వన్డే శతకాలు సాధించాడు.ఇంగ్లాండ్‌లో అత్యధిక వన్డే శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్‌కోథిక్ 8 వన్డే సెంచరీలతో రెండో ప్లేసులో నిలిచాడు. తాజాగా రోహిత్ శర్మ.. ట్రెస్‌కోథిక్ సరసన చేరి.. ఇంగ్లీష్ బ్యాటర్లకు సమఉజ్జీనని నిరూపించుకున్నాడు.