: భారతదేశంలో నిత్యం కోట్లాది మంది జనం రైళ్లలో ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, కుటుంబం, స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు, విహార యాత్రలకు వెళ్లాల్సి వచ్చినా ఎక్కువగా రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతుంటారు. ఇక్కడ కంఫర్ట్ ఉండటంతో పాటు ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే ధర కూడా చాలా తక్కువ. అయితే ఏ రైలు చూసినా రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం చాలా రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే గానీ కూర్చొని వెళ్లలేం. చాలా వరకు రైలు ప్రయాణానికి ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుకింగ్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ బుకింగ్ సమయంలో చాలా స్టెప్స్ ఉంటాయి. తీరా కొన్ని సార్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే లోడ్ అవుతుంటుంది. సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. చిరాకు కలిగించేలా గ్రాఫిక్స్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ క్రమంలోనే రైలు టికెట్లను మరింత వేగంగా, ఈజీగా తీసుకోగలిగేలా IRCTC కొత్త వెబ్‌సైట్‌ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా జులై 15న బీటా వెర్షన్‌ను లాంఛ్ చేసింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ పలు కీలక మార్పుల్ని ప్రవేశపెట్టింది. ముందుగా కస్టమర్లు దీనిని వినియోగించి, మరేమైనా మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు, విలువైన సలహాలు ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతోంది. దీనికి సంబంధించి ఒక లింక్ ఇచ్చింది. https://www.irctc.co.in/eticket/train-search ఇందులోకి నేరుగా వెళ్లొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న చేయగానే అక్కడ హోం పేజీలో కూడా న్యూ వెబ్‌సైట్ బీటా వెర్షన్‌కు ఎక్స్‌ప్లోర్ అవ్వొచ్చని కనిపిస్తుంది. సలహాలు ఇవ్వాలని అక్కడే సూచించింది. దానిని క్లిక్ చేసి పైలట్ ప్రాజెక్టుగా ఉన్న కొత్త వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు.Read Also: ఇక్కడ కొత్త వెబ్‌సైట్‌లో ఐఆర్‌సీటీసీ ముఖ్యంగా ప్రయాణికులకు మరింత మెరుగైన ఇంటర్‌ఫేస్, అప్డేటెడ్ నావిగేషన్, లోపాల్లేకుండా, అంతరాయాలు లేకుండా వేగంగా టికెట్ బుకింగ్ సామర్థ్యాల్ని మెరుగుపర్చింది. మరింత మెరుగైన ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. ఇంకా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టేలా కూడా కీలక చర్యలు చేపట్టింది. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. సమయంలో ముందుగా అనవసరమైన క్యాప్చా కోడ్, పాప్‌అప్స్ వంటివి ఇందులో ఉండవు. అన్ని తరగతుల్లో సీట్లు/బెర్తుల లభ్యత లేదా అందుబాటు వివరాల్ని ప్రయాణికులు ఒకేసారి ఒకే దగ్గర చూడొచ్చు.టికెట్ బుక్ చేసేందుకు అవసరమైన దశల్ని గణనీయంగా తగ్గించింది. ప్రయాణికుల వివరాలు సేవ్ చేసుకోవచ్చు. దీంతో మళ్లీమళ్లీ టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రతిసారీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ మార్పులతో ప్రయాణికులు తమ అనుభవాల్ని, మార్పులు, చేర్పుల్ని నివేదిస్తే అవసరమైన మేరకు అప్డేట్ చేసి వీలైనంత త్వరగా మరింత మెరుగ్గా సేవలందించేలా కొత్త వెబ్‌సైట్‌ను ఐఆర్‌సీటీసీ త్వరలో అధికారికంగా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.