సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. జులై 16న హైదరాబాద్, విజయవాడలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే!

Wait 5 sec.

Gold Rate Today: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసివేయడం, ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని అమెరికా ప్రకటించడం వంటి అంశాలు బులియన్ మార్కెట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈరోజు సడెన్ షాకిచ్చాయి. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం రేట్లు మళ్లీ భారీగా తగ్గాయి. అంటే దేశీయంగానూ మళ్లీ తగ్గుతాయని అంచనా వేయవచ్చు. ఈ క్రమంలో జులై 16వ తేదీన హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. ఇరాన్- అమెరికా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతాయన్న అంచనాలతో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో పసిడి రేట్లు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 32 డాలర్ల మేర పడిపోయి 4031 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.95 శాతం మేర పడిపోయి 57 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలునాలుగు రోజుల తర్వాత పసిడి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.770 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,43,570 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.700 పెరగడంతో తులం రేటు రూ.1,31,600 వద్దకు చేరింది. విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరమైన విజయవాడలోనూ ఈరోజు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.770 పెరిగి రూ.1,43,570 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు రూ.700 పెరిగి రూ.1,31,600 వద్ద ట్రేడింగ్ అవుతోంది. రూ.5000 పెరిగిన వెండి ధరబంగారంతో పాటు వెండి రేటు సైతం ఈరోజు భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి రేటు ఈరోజు రూ.5000 మేర పెరిగింది. దీంతో కిలో వెండి రూ.2,40,000 మార్క్ తాకింది. గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు జులై 16వ తేదీ గురువారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, 10 గంటల తర్వాత పసిడి రేట్లు మారిపోతుంటాయి. కొనుగోలు చేసే వారు స్థానికంగా ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.