నేడు ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. సిరీస్‌పై కన్నేసిన భారత్..!

Wait 5 sec.

ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో తేలిపోయిన భారత జట్టు వన్డే సిరీస్‌పై కన్నేసింది. నేడు కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డేలో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కుప్పకూలడంతో లభించిన అవకాశాన్ని దాంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో గిల్ 80 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ, అతడు రెండో వన్డేకు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని సమాచారం. అయితే మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముగ్గురూ కలిసి కేవలం 17 పరుగులు మాత్రమే చేయడంతో ఈరోజు వారిపై అందరి కళ్లు ఉన్నాయి. బౌలింగ్‌లో గుర్నూర్ బ్రార్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ఉన్నందున, అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.ఈరోజు మ్యాచ్ జరగబోయే కార్డిఫ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన గత నాలుగు వన్డేలలో 280 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. ఎలాంటి వర్ష సూచన లేదు. టీమిండియా చివరగా 2014లో కార్డిఫ్ మైదానంలో వన్డే ఆడింది. ఆ జట్టులో ఉండి ప్రస్తుత జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ మాత్రమే కావడం విశేషం.మరోవైపు టీ20ల్లో తిరుగులైన ఆధిపత్యం చలాయించిన ఇంగ్లాండ్.. తొలి వన్డేలో కంగుతింది. ఈ మ్యాచులో ఓడిపోతే సిరీస్ చేజారే అవకాశం ఉన్నందున ఆ జట్టు.. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. జో రూట్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది. ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.