పెట్రోల్‌పై విండ్‌‌ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం- డీజిల్, విమాన ఇంధనంపై మళ్లీ పెంపు- నేటి నుంచే అమల్లోకి!

Wait 5 sec.

అమెరికా- ఇరాన్ మళ్లీ భీకర దాడులు జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వరుసగా 4-5 రోజులుగా పెరుగుతుండగా దీనికి అనుగుణంగా దేశీయంగా ఇంధన లభ్యతను నిర్ధరించేందుకు మోదీ సర్కార్ కీలక చర్యలకు ఉపక్రమించింది. డీజిల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై (ATF) విండ్‌ఫాల్ టాక్స్‌ను మరోసారి పెంచింది. దేశీయంగా ఉత్పత్తి అయి విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరు‌పై అంతకుముందు ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకం (SAED) రూ. 8.5 గా ఉండగా దాదాపు రెట్టింపు చేసి ఇప్పుడు రూ. 15.5 కు చేర్చింది. ఇదే సమయంలో విమాన ఇంధనంపైనా అంతకుముందు లీటరుపై రూ. 7.5 గా ఉంటే ఇక్కడ కూడా దాదాపు డబుల్ చేసి రూ. 14.5 కు చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉన్నా మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం విశేషం. అంతకుముందు లీటరు పెట్రోల్‌పై ఈ ఎక్సైజ్ సుంకం రూ. 4 గా ఉండగా ఇప్పుడు దానిని రూ. 2.5 కు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ కొత్త సవరించిన రేట్లు జులై 16 నుంచే (గురువారం) అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదీ చూడండి: మరోవైపు దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంకా దీని కారణంగా రిటైల్ ధరలపైనా ఎలాంటి ప్రభావం ఉండదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ క్రూడాయిల్ ధరలు మరోసారి పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ దాడులతో హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న వేళ సరఫరా అంతరాయాలు నెలకొన్నాయి. దీంతో ఇంధన కొరతను అధిగమించేందుకు, దేశీయంగా చమురు లభ్యత కోసం ఇలా కేంద్రం ఎగుమతులపై సుంకాల్ని విధిస్తోంది.Read Also: మొదట్లో రష్యా ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్న వేళ 2022 జులైలో తొలిసారి ఈ విండ్‌ఫాల్ టాక్స్ సిస్టమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర విపరీతంగా పెరగ్గా దేేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలు విదేశాలకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్ వంటి ఉత్పత్తుల్ని ఎగుమతి భారీగా లాభాలు ఆర్జించాయి. రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు లబ్ధి పొందాయి. ఈ క్రమంలోనే వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఇంకా దేశీయంగా చమురు లభ్యత పెంచేందుకు ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ విధించింది. తర్వాత చమురు ధరలు తగ్గగా 2024లో పూర్తిగా ఎత్తేసింది. ఇటీవల అమెరికా- ఇరాన్ సంఘర్షణతో . ప్రస్తుతం భారత్‌లో లీటరుకు రూ. 115.73 గా ఉండగా, డీజిల్ ధర రూ. 103.82 గా ఉంది.