Kuppam: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. గుడికని తీసుకెళ్లి భర్తను చంపిన భార్య!

Wait 5 sec.

వివాహేతర సంబంధాలకు భర్తలు బలవ్వడం ఇంకా ఆగడం లేదు. దేశంలో రోజూ ఏదోక మూల భర్తను హత్య చేసిన భార్య, సుఫారీ ఇచ్చి చంపించిన అర్ధాంగి అన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. గుడికి వెళ్దామని చెప్పి భర్తను హత్య చేసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ హోసూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో అతనికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న మౌలికశ్రీ అనే పాప కూడా ఉంది. కొద్ది రోజులు సంతోషంగా గడుపుదామని అల్లుడు రమేశ్ తన అత్తగారిల్లయిన కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు వచ్చాడు. సోమవారం రోజు భార్య హాసిని, కూతురు మౌలికశ్రీతో కలిసి అత్తగారింటికి వచ్చాడు. మంగళవారం రోజు సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామికి వెళ్దామని హాసిని తన భర్త రమేశ్‌కు చెప్పింది. READ ALSO దాంతో భార్య, కూతురుని బైక్‌పై ఎక్కించుకుని మల్లేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం కుటుంబం మొత్తం బయల్దేరింది. అయితే, ఉదయం వెళ్లిన వారు రాత్రయినా రాకపోవడంతో హాసిని తల్లికి అనుమానం వచ్చింది. ఫోన్లకు కూడా స్పందించకపోవడంతో వెంటనే కుప్పం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో మొదట భర్త, పాపతో హాసిని బైక్‌పై ఆలయానికి వెళ్లినట్లు కనిపించింది. రిటర్న్‌లో మాత్రం భర్త తెచ్చిన బైక్‌పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తించారు. వాటి ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో మృతదేహం లభించింది. ఈ కేసుపై పోలీసులు ప్రస్తుతానికి ఓ ప్రాథమిక దర్యాప్తునకు వచ్చారు. రమేశ్ భార్యే మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడిస్తామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు.