స్టాక్ మార్కెట్లో మంచి రోజులు ఉంటాయి. చెడ్డ రోజులు ఉంటాయి. కొన్ని స్టాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఊహించని రీతిలో పెరగొచ్చు. అదే ఇంకొన్ని స్టాక్స్ అదే ఊపులో కొంటే పడిపోయే ప్రమాదం ఉంటుంది. బ్లూ చిప్ స్టాక్స్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలా వీటి పరిస్థితే అర్థం కాట్లేదు. ఒకప్పుడు ఇవి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచేవి. కానీ కొన్నేళ్లుగా దాదాపు వీటి ధర స్థిరంగానే ఉండటం గమనార్హం. అయితే కొన్ని గతంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన స్టాక్స్ కూడా దారుణంగా పడిపోతుండటం కలవరపెడుతోంది. ఇందులో ఇటీవలి కాలంలో గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. . ఏడాదిలో ఇది దాదాపు 32 శాతం పతనమైంది. అయితే ఇదే నుంచి మరో స్టాక్ మరింత భారీగా పడిపోయింది. అదే ప్రముఖ డిజైన్, టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ టాటా ఎల్‌క్సీ. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తుల్ని డిజైన్ చేసేందుకు, వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్, టెక్నాలజీని అందించేందుకు పనిచేస్తుంది. ఈ కంపెనీ షేర్లు ఇప్పుడు భారీగా పతనం అవుతున్నాయి. బుధవారం రోజు ఇంట్రాడేలో దాదాపు 6 శాతం కుదేలై రూ. 3469.70 వద్ద సెషన్ కనిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఇదే స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర కూడా కావడం గమనార్హం. స్టాక్ భారీ పతనంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయి. Read Also: ఇంట్రాడేలో నష్టాల్ని కాస్త తగ్గించుకొని సెషన్ చివరకు 4.44 శాతం పతనంతో రూ. 3533 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు రూ. 21.93 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వీక్ హై వాల్యూ చూస్తే రూ. 6439.50 గా ఉంది. నెల వ్యవధిలో ఈ స్టాక్ ధర 15 శాతం వరకు తగ్గగా, 6 నెలల్లో 37 శాతం పతనమైంది. ఇక ఏడాది వ్యవధిలో చూస్తే 44 శాతం తగ్గి ఇన్వెస్టర్లకు గుండె కోత మిగిల్చింది. ఇప్పుడు స్టాక్ భారీ పతనానికి కారణం క్యూ1లో బలహీన ఫలితాలు నమోదు చేయడమే. అవును 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో నికర లాభం రూ. 170.6 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఇది 18.2 శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం కూడా 14.5 శాతం పెరిగి రూ. 1021.1 కోట్లుగా వచ్చింది. అయితే ఇక్కడ కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే లాభం పెరిగినా, కిందటి త్రైమాసికంతో చూస్తే భారీగా తగ్గింది. ఇంకా ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గడం, ఖర్చులు పెరగడం కారణంగా ఫలితాలు మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఇదే సమయంలో పలు బ్రోకరేజీలు స్టాక్ టార్గెట్ ప్రైస్ తగ్గించడం ప్రభావం చూపింది. దీంతో అమ్మకాలు పెరగ్గా స్టాక్ ధర భారీగా పతనం అవుతోంది. వాస్తవానికి 2022లో ఇదే టాటా ఎల్‌క్సీ షేరు రికార్డు స్థాయిలో రూ. 10 వేలకుపైగా ఉండటం విశేషం. అక్కడి నుంచి పడుతూనే వస్తోంది. Disclaimer: పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు రిస్క్‌కు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.