: ప్రస్తుత పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు మాత్రం ఎలాంటి రిస్క్ లేని స్థిర ఆదాయం ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపే చూస్తుంటారు. గత కొద్ది నెలలుగా వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయిన క్రమంలో ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ రేటు వస్తుందో తేల్చుకోలేకపోతున్నారు. అలాంటి వారందరి కోసమే ఈ కథనం. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. మరి ఆ బ్యాంకుల్లో రూ. 5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుందో తెలుసుకుందాం.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ()లో ప్రస్తుతం 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్లకు 3 ఏళ్ల 1 రోజు మెచ్యూరిటీ కాల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రూ. 5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూ. 1,27,600 వరకు వస్తాయి. అంటే అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 1,27,600 వరకు వస్తాయి.శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (Shivalik Small Finance Bank)లో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 23 నెలల నుంచి 27 నెలల టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఇందులో ఒక సీనియర్ సిటిజన్ 27 నెలల టెన్యూర్ ఎంచుకుని రూ. 5 లక్షలు జమ చేశాడు అనుకుందాం. మెచ్యూరిటీ తర్వాత చేతికి వడ్డీనే రూ. 95,850 వరకు వస్తాయి. అంటే అసలు, వడ్డీ కలిపి రూ. 5,95,850 వరకు వస్తాయి.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సిటిజన్లకు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.30 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో 3 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుని రూ. 5 లక్షలు జమ చేశారు అనుకుందాం. అప్పుడు మెచ్యూరిటీ తర్వాత చేతికి అసలు, వడ్డీ కలిపి రూ. 6,25,600 వరకు వస్తాయి.Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం ఇచ్చేందుకే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు నిర్ణయిస్తుంటాయి. బ్యాంకు నిబంధనలు, అదనపు ఛార్జీలు వంటి పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.