భారతదేశంలో మొట్టమొదటి జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. జపాన్‌కు చెందిన ఓ ఇంజినీర్ భారత బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ విషయంలో స్థానిక వార్తాపత్రికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. చర్చల సందర్భంగా భారత అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న హిడేకీ.. ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండకుండా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. తాజాగా దీనిపై స్పందించిన భారత్.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలను తోసిపుచ్చింది.‘‘ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం... వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మీడియా సమావేశంలో ఈ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులిస్తూ ‘‘ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం.. వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలుపై భారత్-జపాన్ చర్చలు వాస్తవానికి సానుకూలంగా జరుగుతున్నాయి’’ అని ఆయన తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు జపాన్ ఆర్థిక సహకారం అందిస్తోన్న విషయం తెలిసిందే.జపాన్ షిన్‌కాన్సెన్ టెక్నాలజీ?తమ దేశ ప్రధాన మంత్రి భారత పర్యటన తరువాత కూడా ఈ విషయంలో ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. హైస్పీడ్ రైలు భద్రతకు అత్యంత కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ సరఫరా విషయంలో జపాన్‌ను పక్కనబెట్టారని ఆ దేశ మాజీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షిన్‌కాన్సెన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో బుల్లెట్ రైలు కోసం వినియోగించకపోవడంపై జపాన్‌లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ‘‘సంబంధిత రైలు ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున.. 2030ల ప్రారంభంలో జపాన్ E10 క్లాస్ కోచ్‌లను అందిస్తుంది’’ అని జైస్వాల్ చెప్పారు.ఆగస్టు 2027లో తొలి రైలుఅంతేకాదు, ‘‘నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రారంభమవుతుంది.. అందువల్ల, భారతీయ హై-స్పీడ్ రైలు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.. సిగ్నలింగ్ పరికరాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్డర్ చేశాం... ఈ విషయంలో జపాన్ నుంచి ఎటువంటి ప్రతిపాదన అందలేదు.. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అమలు జరుగుతోంది’’ అని రణధీర్ జైస్వాల్ తెలిపారు.ఇదిలా ఉండగా, ముంబయి- అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును 2023లోనే ప్రారంభించడం అసాధ్యమని భారత అధికారులకు తెలుసనంటూ జపాన్ ఇంజినీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందు ప్రతిపాదించిన అంశాలతో పోలిస్తే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కొంత భిన్నంగా ఉందని అతడు అభిప్రాయపడ్డారు. షిన్‌కాన్సెన్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.