సన్నిహితుడు, టాలీవుడ్ ప్రస్తుతం జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటున్న ఆయన.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రామ్ ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల మూశారనే సంగతి తెలిసిందే. కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించగా.. ముద్రగడ అంతిమ సంస్కారాన్ని జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉండి నిర్వ‌హించారు. పద్మనాభం ఫ్యామిలీని ఓదార్చి, వారికి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. అంతిమ యాత్ర‌లో . దీనిపై అధికార కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారు. పద్మనాభం కూతురు క్రాంతికి తండ్రి చివరి చూపు చూసుకోనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని, జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రామ్ తాళ్లూరి సైతం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''ఇంకెన్నాళ్ళు శవ రాజకీయాలు చేస్తావ్ జగన్?. ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీకి ఎంతో సేవలు అందించినా ఏనాడైనా పార్టీలో ఆయనకు కనీస గౌరవం కల్పించావా? మీ పార్టీ తరపున ఎన్నో సేవలు అందించిన ముద్రగడ గారికి MLA, MP, రాజ్యసభ ఆఖరికి నామినేటెడ్ పదవి అయినా ఇచ్చావా? కనీసం వారి కుటుంబ సభ్యులకు అయినా టిక్కెట్ ఇచ్చావా?. ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం హాస్పిటల్ కి కూడా వెళ్ళి పరామర్శించని నువ్వు ఈరోజు ఆయన చనిపోయిన తరువాత శవ రాజకీయం చేయడానికి వస్తావా?''''సొంత చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి గారి పార్థివదేహాన్ని మోయని నువ్వు ఈరోజు కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టేందుకు ముద్రగడ గారి దేహాన్ని మోసి శవ రాజకీయం మొదలు పెట్టావు. నీ నీచ రాజకీయాలకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కన్న కూతురును తండ్రి నుండి దూరం చేసిందే కాకుండా, ఆఖరి చూపులు కూడా చూడనీయకుండా ముద్రగడ గారి కుమార్తె క్రాంతి గారిని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అడ్డుకుంటారా?''''సొంత కుటుంబంలో ఆడవారిని నువ్వు గెంటేసినట్లే అందరి ఇళ్లలో జరగాలి అనే కుంచిత మనస్తత్వం మంచిది కాదు జగన్. మాజీ మంత్రిగా పనిచేసిన ముద్రగడ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తుంటే, ఒక కాపు నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకులతో గొడవలు సృష్టిస్తావా?. ముద్రగడ గారి కుటుంబ వ్యవహారాల్లో మీ పార్టీ పెత్తనం ఏంటి జగన్? బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ దిక్కుమాలిన రాజకీయాలకు ముద్రగడ గారిని వాడుకున్నావ్, మరణానంతరం కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసిన నిన్ను చరిత్ర మర్చిపోదు జగన్'' అని రామ్ తాళ్లూరి తన పోస్టులో రాసుకొచ్చారు. దీనికి వైయస్ జగన్ చేయడంతో పాటు #YSRSavaRajakeeyaParty అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. అయితే రామ్ తాళ్లూరికి వైసీపీ శ్రేణులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ముద్రగడ ఎన్నికలకు ముందు తమ పార్టీలో జాయిన్ అయ్యారని, అప్పటికే తమ క్యాండిడేట్స్ ను ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.