ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల సూచన మేరకు మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధులు నిర్వహించాలని నిర్ణయించారు. రొటేటర్ కఫ్ గాయానికి చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో నిర్వహించారు. అనంతరంఅయ్యి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి ఉండాలనే ఉద్దేశంతో.. సోమవారం రోజున ఆపరేషన్ తర్వాత తొలిసారిగా మంగళగిరి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం.. పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా ప్రజల మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని స్పష్టం చేశారు. అలాగే ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు వారాల పాటు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే పవన్ కళ్యాణ్ విధులు నిర్వహించనున్నారు. మరోవైపు సర్జరీ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నాలుగు నెలలు సమయం పట్టొచ్చని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.