ఎల్‌నినో ప్రభావం తెలంగాణపైనే ఎక్కువ.. జిల్లాకో ప్రత్యేకాధికారి.. మంత్రి ఉత్తమ్‌ కీలక సూచనలు

Wait 5 sec.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రంలోని రైతులకు కీలక సూచనలు చేశారు. రైతులంతా వరి సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు చేశారు. నల్గొండ కలెక్టరేట్‌లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగు చేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంపైనే ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈ క్రమంలోనే సజ్జ, జొన్న, రాగులు, వరిగలు, కంది, పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలను వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. అదే సమయంలో కొన్ని కూరగాయల పంటలను కూడా సాగు చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ విషయంపై గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎల్‌నినో పరిస్థితులపై చర్చించి.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమై అవసరమైన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వీరు వర్షపాతం, సాగునీరు, తాగునీటి లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, విద్యుత్ సరఫరా, వ్యవసాయ పరిస్థితులను నిరంతరం సమీక్షించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని శాఖల మధ్య సమన్వయం చేసి తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లా-అధికారి పేరుహైదరాబాద్ - జయేష్ రంజన్రంగారెడ్డి - వికాస్ రాజ్కరీంనగర్ - మహేష్ దత్ ఎక్కామెదక్ - వాణి ప్రసాద్నిజామాబాద్ - యోగితా రాణానల్గొండ - హరిచందనఆదిలాబాద్ - ఇలంబర్తివరంగల్ - దేవసేనామహబూబ్ నగర్ - గౌతమ్ఖమ్మం - అనుదీప్ దురిశెట్టి