ఆ వాహనదారులకు NHAI రిలీఫ్.. ఇక యాప్ ద్వారా 'టోల్ పాస్'.. రూ.340కే నెలంతా అన్‌లిమిటెడ్ ట్రిప్పులు!

Wait 5 sec.

Toll Gate Local Pass: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. అదిరే శుభవార్త చెప్పింది. ఏదైనా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులు రాయితీతో కూడిన నెలవారీ లోకల్ పాస్ కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ పాస్ ఇకపై తమ మొబైల్‌లోనే రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారానే సులభంగా కొనుగోలు చేయవచ్చని, ప్రతి నెలా రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల డాక్యుమెంట్లు సమర్పించడం, టోల్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని తెలిపింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈజీగా కొనుగోలుటోల్ ప్లాజాకు 20 కిలో మీటర్ల పరిధిలోని వాహనదారులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులోని లోకల్ పాస్ ఆప్షన్ ద్వారా తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం టోల్ ప్లాజా ప్లాంట్ డిప్యూటీ ఆఫీసులకు వెళ్లి భౌతికంగా ఫామ్స్ నింపాల్సిన అవసరం తొలగిపోయింది. సదరు నిర్దేషిత టోల్ ప్లాజాకు 20 కిలో మీటర్ల లోపే నివసిస్తున్నారని నిరూపించేందుకు మీ అడ్రస్ ప్రూఫ్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్ఏఐ సిస్టమ్ వాటిని ఆటోమేటిక్‌గా వెరిఫై చేస్తుంది. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన వెంటనే, మీ వాహనానికి ఉన్న ఫాస్టాగ్ కు ఈ లోకల్ పాస్ లింక్ అవుతుంది. దీని వల్ల మీరు ఆ టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు స్థానికులకు ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ ధర మాత్రమే కట్ అవుతుంది. రూ. 340కే నెలంతా అన్‌లిమిటెడ్ ట్రిప్పులుజాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై , నెలవారీ టోల్ పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఒకే టోల్ గేట్ వద్ద తరుచూ ప్రయాణించే స్థానికులకు అపరిమిత రాకపోకలకు ఉపయోగపడేలా లోకల్ పాస్ ఇస్తోంది. టాల్ ప్లాజాకు 20 కిలో మీటర్ల పరిధిలో నివసించే స్థానికుల కోసం ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ప్రైవేట్ కార్లు (వైట్ ప్లేట్) నెలకు రూ. 340 మాత్రమే చెల్లించి నిర్దిష్ట టోల్ గేట్ గుండా అపరిమిత క్రాసింగ్‌లు చేసుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. యెల్లో ప్లేట్ ఉండే కమర్షియల్ వాహనాలకు వర్తించదని గుర్తుంచుకోవాలి.