కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్ ..

Wait 5 sec.

కాపు ఉద్యమ నేత, అంత్యక్రియల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి అర్పించారు. అంతకుముందు హెలికాప్టర్‌లో జగ్గంపేటకు చేరుకున్న వైఎస్ జగన్ .. జగ్గంపేట నుంచి రోడ్డు మార్గాన కిర్లంపూడిలోని పద్మనాభం ఇంటికి వెళ్లారు. అర్పించి.. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం ముద్రగడ పాడె మోసి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వంద మీటర్ల దూరంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.మరోవైపు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. జూన్ నెలలో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరారు. అనంతరం అక్కడి నుంచి సింధు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం.. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త విన్న వైఎస్ జగన్.. ముద్రగడ తనయుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ముద్రగడ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని తెలిసి ధైర్యంగా ఉన్నామని.. ఇంతలోనే ఇలాంటి వార్త వినడం బాధాకరమంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు.నమ్మిన మాటకు కట్టుబడి, నిలబడే తత్వం ముద్రగడదన్న వైఎస్ జగన్.. మంచికోసం ఎంతదూరమైనా వెళ్ల్తారని కొనియాడారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి ముద్రగడ పద్మనాభం నిలువెత్తు రూపమన్న వైఎస్ జగన్.. ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముద్రగడను అభిమానించే లక్షల మందికి తీరని లోటుగా అభివర్ణించారు. ఈ సమయంలో ముద్రగడ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇక బుధవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన జగన్.. ఆక్వా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా జగ్గయ్యపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన జగన్.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.