Gold Rate Today: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. హార్ముజ్ జల సంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. దీంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో పసిడి రేట్లు భారీగా దిగివచ్చాయి. నాలుగు రోజుల్లో తులం బంగారం రేటు రూ. 2000 పైన పడిపోయింది. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బంగారం ధరలపై భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చమురు ధరలు ప్రభావితం చేస్తుంటాయి. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ముగిసి మళ్లీ దాడులు చేసుకుంటుండడంతో బంగారం రేట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో జులై 15వ తేదీన దేశీయంగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సడెన్ షాకిచ్చాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4000 డాలర్ల దిగువకు పడిపోగా ఇవాల ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 59 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 4057 డాలర్ల స్థాయిని దాటింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.23 శాతం మేర పెరిగి 59 డాలర్ల స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.110 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,42,800 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.100 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,30,900 వద్దకు దిగివచ్చింది. రూ.5000 తగ్గిన వెండిబంగారంతో పాటు వెండి రేటు సైతం దిగివచ్చింది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.5000 మేర పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,35,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. గమనిక: పైన చెప్పిన గోల్డ్, సిల్వర్ రేట్లు జులై 15వ తేదీ బుధవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు 10 గంటల తర్వాత మారుతుంటాయి. అలాగే జీఎస్టీ, స్థానిక పన్నులతో ప్రాంతాల వారీగా ధరలు వేరు వేరు ఉంటాయి. కొనే ముందు మీ ప్రాంతంలోని ధరలను తెలుసుకోవడం మంచిది.