Investments: దిగ్గజ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటైన నుంచి ఒక స్కీమ్ అదరగొట్టింది. అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్. ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంతో పాటు స్వల్ప కాలంలో కూడా కాసుల పంట పండించింది. నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి అద్భుత స్థాయిలో రాబడి అందించింది. ఐదేళ్ల కిందట ఇందులో నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించిన వారికి సగటున వార్షిక ప్రాతిపదికన 13.83 శాతం XIRR చొప్పున రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ రూ. 9 లక్షల వరకు ఇప్పటివరకు చేతికి వచ్చింది. విశేషం ఏంటంటే ఈ స్కీమ్ ప్రారంభమైంది కూడా ఐదేళ్ల కిందటే. ఈ క్రమంలో నెలకు రూ. 10 వేల చొప్పున చూస్తే ఐదేళ్లలో మీ పెట్టుబడి రూ. 6 లక్షలుగా ఉంటుంది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ బీఎస్ఈ 500 TRI ఇండెక్స్ సగటున వార్షికంగా 10.43 శాతం వరకు XIRR రిటర్న్స్ మాత్రమే అందించింది. ఇక ఇదే సమయంలో నెలకు చేసిన వారికి మూడేళ్లలో కూడా రూ. 4.17 లక్షలు వచ్చాయి. ఏడాది కాలంలో రూ. 10 వేల సిప్‌తో రూ. 1.23 లక్షలు అందాయి. మరోవైపు లంప్ సమ్ పెట్టుబడిపైనా అదిరిపోయే రాబడి అందించింది. ఇందులో ఐదేళ్ల కిందట ఒకేసారి రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 19.61 లక్షలు వచ్చాయి. అంటే దాదాపు పెట్టుబడిపై డబుల్ రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ 14.55 శాతం CAGR రిటర్న్స్ వచ్చాయి. ఇదే పెట్టుబడి బీఎస్ఈ 500 TRI లో చేస్తే రూ. 17.4 లక్షలే అయ్యేది.Read Also: ఈ స్కీమ్ విషయానికి వస్తే 2021, జులై 17న లాంఛ్ అయింది. అంటే సరిగ్గా నిన్నటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వృద్ధి విలువను సృష్టిస్తుందనే నమ్మకంపై ఆధారపడిన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తుంది. బాటమ్ అప్ స్టాక్ ఎంపిక విధానం ద్వారా అధిక వృద్ధి అవకాశాల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. ఇది మార్కెట్ పరిస్థితుల్ని బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ స్కీమ్. మెజార్టీ భాగం ఈక్విటీలకే కేటాయిస్తుంది. ఈ ఫండ్ మేనేజర్‌గా ప్రస్తుతం ఈ ఫండ్ మేనేజర్‌గా రజత్ ఛందక్ ఉన్నారు.