ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలి.. పవన్ కళ్యాణ్

Wait 5 sec.

కాపు ఉద్యమ నేత కన్నుమూశారు.73 ఏళ్ల ముద్రగడ పద్మనాభం... గత కొన్నిరోజులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లో ఉన్న సింధు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో మంగళవారం సాయంత్రం ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. మరోవైపు ముద్రగడ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త విచారం కలిగించిందన్న చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ స్పందన..మరోవైపు స్పందించారు." మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన.. నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు ముద్రగడ.. విజయసాయిరెడ్డిముద్రగడ పద్మనాభం సమాజానికి ఎంతో ఇచ్చి, తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో నిజాయతీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తల ఒగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి పదాలకు తమ జీవితంలో ఆచరణ ద్వారా అర్థం చెప్పిన మన స్వాతంత్య్ర సమర యోధుల కోవకు చెందిన అరుదైన అగ్ర శ్రేణి నాయకుడు, మానవతామూర్తి ముద్రగడ అని కొనియాడారు. ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెద కాపు అని.. ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.