నిరాశపరిచిన రో-కో.. కష్టాల్లో భారత్..!

Wait 5 sec.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఫార్మాట్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తారని, మైదానంలో పరుగుల వరద పారిస్తారని కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన సీనియర్ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ నిరాశపరిచారు. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని ఆతిథ్య బౌలర్లు వేసిన వ్యూహాత్మక బంతులకు మన స్టార్లు విఫలమయ్యారు.శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. సాధారణంగా వన్డేల్లో ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త సమయం తీసుకుని ఆ తర్వాత విరుచుకుపడే రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో మాత్రం బంతిని సరిగ్గా టైమింగ్ చేయలేక తెగ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లాండ్ పేసర్లు స్వింగ్‌తో ఇబ్బంది పెడుతుండటంతో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. చివరకు రోహిత్ శర్మ 21 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క బౌండరీ సహాయంతో 11 పరుగులు మాత్రమే చేసి, వికెట్ పారేసుకున్నాడు. రోహిత్ ఔట్ కావడంతో స్టేడియంలోని భారత అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. చేజింగ్‌లో రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ జట్టును ఆదుకుంటాడని అందరూ భావించారు. క్రీజులోకి రాగానే ఒక పరుగు తీసి ఖాతా తెరిచిన కోహ్లీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఒకే ఒక్క ఫోర్ కొట్టి, 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు పవర్‌ప్లేలోనే చాలా తక్కువ పరుగుల వ్యవధిలోనే ఔట్ కావడంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. జట్టును గెలిపించే బాధ్యత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై పడింది.