భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్.. 258 పరుగులకు ఆలౌట్ అయింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓ దశలో బౌలర్లు చెలరేగడంతో 80 పరుగులకే ఇంగ్లీష్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో (76 నాటౌట్‌), లియామ్ డాసన్ (68) సెంచరీకి పైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆ జట్టు కోలుకుంది. చివరకు సవాల్ విసిరే లక్ష్యాన్ని టీమిండియా ముందు నిలిపింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు సత్తాచాటారు. యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్, బుమ్రా రాణించడంతో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 17 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయింది. అప్పటికి స్కోరు 80 రన్స్‌గా ఉంది. కాసేపటికే విల్ జాక్స్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్.. 150 రన్స్‌లోపు ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ ఇక్కడే రూట్, డాసన్ నిలబడ్డారు.భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ ఈజీగా రన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. డాసన్.. 83 బంతుల్లో 68 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. దీంతో 121 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు పుంజుకున్నారు. రూట్ నిలబడ్డా.. మిగతా బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. దీంతో ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ 76 బంతుల్లో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.మరోవైపు భారత బౌలర్లలో అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబె ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. టీమిండియా 259 రన్స్ చేస్తే.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లనుంది.