అర్ధరాత్రి నగ్నంగా పరుగెత్తి చెరువులో దూకిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. పని ఒత్తిడి తట్టుకోలేకనే..!

Wait 5 sec.

సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న ఎంతటి ఘోరానికి దారితీస్తాయో నిరూపించే ఒక అత్యంత విచారకరమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి, రూ.లక్షల్లో జీతం సంపాదిస్తూ ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఒక యువ ఇంజినీర్ జీవితం జాబ్ స్ట్రెస్ కారణంగా ఒక్కసారిగా తలకిందులైంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజయనగరం జిల్లా దేవుపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్‌రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేది. అయితే, ఆఫీస్ పని ఒత్తిడిని భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఆర్నెల్ల క్రితం ఉద్యోగం మానేసి విశాఖపట్నం వచ్చేసింది.ఆ తర్వాత మానసిక ప్రశాంతత కోసం రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి పీర్జాదిగూడలోని శంకర్‌నగర్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. మరోచోట గదిని అద్దెకు తీసుకోవడానికి తల్లి, కుమార్తె కలిసి శుక్రవారం మియాపూర్‌లో ఇళ్లు గాలించి రాత్రికి తిరిగి పీర్జాదిగూడకు వచ్చి పడుకున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో తీవ్ర మానసిక భ్రాంతికి గురైన తేజస్విని.. తల్లి పడుకున్న గదికి బయట నుంచి తాళం వేసింది. అనంతరం చేతిలో చీర పట్టుకుని నగ్నంగా వీధిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. మార్గమధ్యంలో బీరప్ప గుడి వద్ద ఆగి దండం పెట్టుకుని, మళ్లీ పరుగెడుతూ పీర్జాదిగూడలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ షాకింగ్ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఉదయం నిద్రలేచిన తల్లి తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తాళం తెరిచారు. అనంతరం కుమార్తె కోసం చుట్టుపక్కల వెతకగా.. పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెకు తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, తీవ్రమైన మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి మేడిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మృతురాలు తీవ్రమైన ఫియర్‌ ఫోబియాతో బాధపడేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.