మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి 5 కొత్త పథకాలు.. జులై 20 నుంచే షురూ.. రూ.100 ఉన్నా చాలు..!

Wait 5 sec.

: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారికి సూపర్ గుడ్‌న్యూస్. ఈ వారం దేశీయ మార్కెట్లోకి సరికొత్త థీమ్స్, కేటగిరీలలో 5 కొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్‌తో ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మార్కెట్లోకి కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తున్నాయి. కొత్త స్కీమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రారంభ దశనే ఎన్ఎఫ్ఓ అంటారు. సాధారణంగా ఎన్ఎఫ్ఓ సమయంలో ప్రతి యూనిట్ ధర రూ.10గా ఉంటుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు లేదా తమ పోర్ట్ ఫోలియోను డైవర్సిఫై చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ వారంలో మొదలవుతున్న కొత్త ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వారం లాంచ్ అవుతున్న రెండు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇక ఒకటి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేటగిరీలో వస్తోంది. మొత్తంగా నాలుగు పాసివ్ ఫండ్స్ అయితే, ఒకటి యాక్టివ్ ఫండ్ అని చెప్పవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రెండుహెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి రెండు కొత్త స్కీమ్స్ లాంచ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ (HDFC Nifty Metal ETF), హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (HDFC Nifty Metal ETF FoF) సబ్‌స్క్రిప్షన్ జులై 20, 2026 రోజున సోమవారం మొదలవుతోంది. ఈటీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ జులై 24వ తేదీన ముగియనుండగా ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనుంది.ఐసీఐసీఐ నుంచి ఒకటిఐసీఐసీఐ ప్రూడెన్షియల్ బీఎస్ఈ ఇన్సూరెన్స్ ఈటీఎఫ్ ఫండ్ (ICICI Prudential BSE Insurance ETF Fund) సబ్‌‍స్క్రిప్షన్ జులై 20వ తేదీన మొదలవుతోంది. జులై 28వ తేదీతో ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది.ఎస్‌బీఐ నుంచి ఒకటి ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (SBI Nifty Midcap 150 Momentum 50 ETF FoF) సబ్‌స్క్రప్షన్ జులై 22వ తేదీన ప్రారంభమవుతోంది. ఆగస్టు 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు.యాక్సిస్ నుంచి ఒకటియాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఆల్ఫా గ్రెప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (AlphaGrep Flexi Cap Fund) సబ్‌స్క్రిప్షన్ జులై 22వ తేదీన మొదలై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు.