‘మన ఇద్దరి డాక్టర్ ఒకరే’.. కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఆసక్తికర రిప్లయ్

Wait 5 sec.

తెలుగు తేజం చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం టోక్యోలో జరిగిన ఫైనల్లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగూచిని వరుస గేమ్‌ల్లో ఓడించింది. గాయాల బారి నుంచి కోలుకొని, సుదీర్ఘ కాలం తర్వాత టైటిల్ గెలిచిన సింధుపై అభినందనల వర్షం కురుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, జై శంకర్, జ్యోతిరాదిత్య సింథియా తదితరులు సింధును అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.వీరి పోస్టులకు బదులిచ్చే క్రమంలో సింధు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘జపాన్ ఓపెన్ సూపర్ 750 గెలుపొందినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సింధు. అకానే యమగూచి సొంత గడ్డ మీద ఏమాత్రం వెరవకుండా నువ్వు చూపిన పోరాట పటిమ భారత ఛాంపియన్ పట్టుదలకు, అజేయ స్ఫూర్తికి నిదర్శనం. సవాళ్లను అధిగమిస్తూ, మరింత బలంగా ఎదుగుతూ.. అగ్రపీఠాన్ని తిరిగి సొంతం చేసుకోవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేసింది. జపాన్‌లో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా మరోసారి ప్రతి భారతీయుణ్ని గర్వించేలా చేశావ్. నీ ప్రయాణం కోట్లాది మంది.. పెద్ద కలలు కనేలా, మరింత శ్రమించేలా, ఎప్పటికీ వెనక్కి తగ్గకుండా ఉండేలా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. ఈ గెలుపు మరెన్నో విజయాలకు పునాది కావాలని ఆశిస్తున్నాను. నీతోపాటు దేశం మొత్తం నీ విజయాన్ని ఆస్వాదిస్తోంది. నీ ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. జై హింద్’’ అంటూ పవన్ కళ్యాణ్ సింధును అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.ఈ పోస్టుకు సింధు ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చింది. ‘‘థ్యాంక్యూ సో మచ్ సర్, మనం ఇద్దరికీ ఒకే డాక్టర్ (దిన్షా) ఉన్నారు. గత ఏడాది చీలమండల గాయం నుంచి నేను కోలుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన అత్యుత్తమ డాక్టర్, ఆయనంటే నాకెంతో ఇష్టం. మీరు సురక్షితమైన చేతుల్లో ఉన్నారు (మంచి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతున్నారు). మీరు పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ సింధు బదులిచ్చింది.ఏపీ డిప్యూటీ సీఎం చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఆయనకు సర్జరీ నిర్వహించారు. 22 ఏళ్ల అనుభవం ఉన్న దిన్షా పార్థీవాలా పది వేలకుపైగా సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.‘‘మే నెలలో జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్‌ను నేను ప్రత్యక్షంగా వీక్షించినప్పుడు.. సింధును బాగా ప్రోత్సహించింది ఆమె భర్త దత్త, వేన్ లాంబార్డ్. ‘శభాష్ శభాష్ సింధు’ అంటూ వారు ఎంకరేజ్ చేశారు’’ అని వినాయక్ అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి సింధు బదులిస్తూ.. ‘ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనికి నా భర్త ఒప్పుకున్నారు. అదే నా టీమ్ పునర్ నిర్మాణం. కోచ్ ఇర్వాన్ అత్యంత కఠినమైన టాస్క్ మాస్టర్. వేన్ ఎలాంటి కష్టాన్నైనా చాలా సరదాగా మార్చేస్తారు. నేను గాయాలపాలు కాకుండా చూసుకున్నందుకు హీరా, శ్రేయసికి ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు.