SBI AMC NFO: దేశంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund) నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది. ఫండ్ ఆఫ్ ఫండ్ () పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ అధికారిక షెడ్యూల్, పెట్టుబడి నిబంధనలు ఖరారు చేసింది. మార్కెట్లో అత్యంత వేగంగా దూసుకుపోయే టాప్ 50 మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఫండ్‌లో భాగస్వాములు కావాలనుకునే వారు చాలా తక్కువ పెట్టుబడితో చేరవచ్చు. మరి ఈ న్యూ ఫండ్ ఆఫర్ గురించిన వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం.ఆగస్టు 4వ తేదీ వరకే ఛాన్స్ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జులై 22, 2026వ తేదీన ప్రారంభమవుతోంది. ఆగస్టు 4, 2026వ తేదీ వరకు ఈ ఎన్ఎఫ్ఓ సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు. ఆ పైన ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రారంభ యూనిట్ ధర రూ.10 చొప్పున కేటాయింపు ఉంటుంది. ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిప్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 టీఆర్ఐ ఉంటుంది. ఈ ఫండ్ మేనేజర్‌గా విరాల్ ఛాద్వా ఉంటారు.చేసుకుంటే 1 శాతం చొప్పున ఎగ్జిట్ లోడ్ కట్ అవుతుంది. 15 రోజుల తర్వాత విక్రయించినట్లయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఈ కొత్త ఫండ్‌లో రిస్క్ వెరీ హైగా ఉంటుందని ఏఎంసీ తెలిపింది. ఇందులో లంప్ సమ్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.ఈ ఫండ్ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జులై 22న మొదలై ఆగస్టు 4న ముగుస్తుంది. గడువు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఫండ్ కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ కొనుగోళ్లకు ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది. ఈ ఎన్ఎఫ్ఓ ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5000 సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత రూ.1 గుణిజాల్లో ఎంతైనా పెంచుకోవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా ఇతర అధీకృత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్ ఫామ్స్ ద్వారా నేరుగా ఆన్‌లైన్లో జులై 22 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.Disclaimer: ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం అందించడం కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే ఫండ్ గురించి సరైన అవగాహన లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి అడుగుపెట్టేవారు ఎన్ఎఫ్ఓల జోలికి వెళ్లకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.