ఆధార్ తరహా 14 అంకెల నంబర్ ఇస్తోన్న RBI.. ఇక KYC తిప్పలుండవ్.. ఒక్క మిస్డ్ కాల్‌తో మీ నంబర్ తెలుసుకోండి!

Wait 5 sec.

RBI On CKYC: మనం ఏ కొత్త బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా ప్రతిసారీ ఆధార్, పాన్ కార్డు వంటి కేవైసీ (KYC) పత్రాలను విడివిడిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ తిప్పలన్నింటికీ అదే సెంట్రల్ కేవైసీ (CKYC). దీని ద్వారా దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ నంబర్ కేటాయిస్తోంది. ఈ నంబర్ ఒక్కసారి తెలుసుకుంటే ఏ ఆర్థిక సంస్థలోనైనా మీ పని నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. సీకేవైసీ అంటే ఏంటి?లాభమేంటి?ఇది సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCR) ద్వారా జారీ చేసే ఒక ప్రత్యేకమైన 14 అంకెల సంఖ్య. మీ కేవైసీ రికార్డులన్ననీ డిజిటల్ రూపంలో ఈ కేంద్ర రిజిస్ట్రీలో భద్రంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త బ్యాంకుకు వెళ్లినప్పుడు ఈ 14 అంకెల నంబర్ చెబితే చాలు సదరు దీంతో మీరు పదే పదే జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం అస్సలు ఉండదు.CKYC నంబర్ సులభంగా పొందే 3 మార్గాలు ఇవేమిస్డ్ కాల్: మీరు చేయాల్సిందల్లా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7799022129కు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడమే. వెంటనే మీ మొబైల్‌కు సీకేవైసీ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ లేదా సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. అధికారిక పోర్టల్ ద్వారా: ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు నేరుగా అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి మీ వివరాలను నమోదు చేయడం ద్వారా మీ డిజిటల్ కేవైసీ కార్డును పరిశీలించవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాంకు ద్వారా: పైన చెప్పిన ఆప్షన్లు కుదరని పక్షంలో మీ ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచీని సంప్రదించి మీ 14 అంకెల సీకేవైసీ ఐటీ నంబర్ ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరవచ్చు.విషయాలు తెలుసుకోండి, జాగురూకంగా ఉండండి అంటూ ఆర్‌బీఐ ఎల్లప్పుడూ కస్టమర్ల సౌకర్యం, భద్రత కోసం ఇలాంటి అవగాహన కల్పిస్తుంది. సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవల కోసం వెంటనే మీ సీకేవైసీ నంబర్ యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తోంది. మరింత అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ వారి వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచిస్తోంది. ప్రతి ఒక్కరు తమ 14 అంకెల సీకేవైసీ నంబర్ తెలుసుకుని ఉండడం ద్వారా ప్రతిసారీ డాక్యుమెంట్లు, జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరాన్ని తప్పించుకోవచ్చని, నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేయవచ్చని తెలిపింది.