Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని క్యాస్టింగ్ అండ్ ఫోర్జింగ్ సెక్టార్ కంపెనీ సింప్లెక్స్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ (Simplex Castings Limited) బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ జులై 20గా నిర్ణయించినట్లు తెలిపింది. జులై 20 రోజున ఈ స్టాక్స్ ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ఆలోపు ఈ కంపెనీలో షేర్లు కొంటే షేర్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 1 కొంటే 5, 100 కొంటే 500 షేర్లుగా మారతాయి. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 35 శాతం లాభాన్ని ఇవ్వగా గత 5 ఏళ్లలో మాత్రమం 940 శాతం మేర పెరిగింది. లక్ష రూపాయలను ఏకంగా రూ.10.40 లక్షలు చేసి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ స్టాక్ స్ప్లిట్ తర్వా ప్రస్తుతం రూ. 527 స్థాయిలో ఉన్న షేర్ ధర సుమారు రూ. 105 లకి స్థాయికి దిగిరానుంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. సింప్లెక్స్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 5 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. అదే సమావేశంలో ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ జులై 20, 2026గా బోర్డు డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో సింప్లెక్స్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ షేరు 1.06 శాతం నష్టంతో రూ. 534.50 వద్ద ముగిసింది. ఈరోజు మరింత తగ్గింది. ఈ వార్త రాసే సమయానికి 1.87 శాతం నష్టంతో రూ.527.95 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 623.50 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 356.60 వద్ద ఉన్నాయి. త ఆరు నెలల్లో ఈ షేరు 8 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 35 శాతం లాభాన్ని అందించింది. ఐదు సంవత్సరాల కాలంలో 940 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయలతో షేర్లు కొంటే ఇప్పుడు ఆ విలువ రూ.10.40 లక్షలకు పైగా చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 433 కోట్ల వద్ద ఉంది.గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.